వింత తెగ.. పిల్లలకు తండ్రులు ఉండరు.. ఎందుకో తెలుసా?

Do you know about the strange wedding tradition in the Mosuo tribe. అక్కడ స్త్రీ, పురుషులు లైంగికంగా కలుస్తారు. పిల్లలను కూడా కంటారు. కానీ, ఆ పిల్లలను తండ్రులు పోషించరు.

By అంజి  Published on  1 Sep 2022 1:02 PM GMT
వింత తెగ..  పిల్లలకు తండ్రులు ఉండరు.. ఎందుకో తెలుసా?

అక్కడ స్త్రీ, పురుషులు లైంగికంగా కలుస్తారు. పిల్లలను కూడా కంటారు. కానీ, ఆ పిల్లలను తండ్రులు పోషించరు. ఆ పిల్లలకు తండ్రులతో ఎలాంటి సంబంధం కూడా ఉండదు. పిల్లల బాగోగులను తల్లి లేదా తల్లి సోదరుడు మాత్రమే చూసుకుంటారు. ఈ వింత సాంప్రదాయాన్ని 'జౌ హున్' వాకింగ్ మ్యారేజ్ అని అంటారు. అంటే పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకోవడం. ఈ వింత సాంప్రదాయం టిబెట్‌లోని ఓ పురాతన తెగలో ఇప్పటికీ అమలులో ఉంది.

టిబెట్‌లోని యున్నావ్, సిచువాన్‌లో 'మొసువో' అనే గిరిజన తెగ ప్రజలు ఈ విధానాన్ని పాటిస్తున్నారు. ఈ తెగలో స్త్రీలే మహారాణులు. మహిళల పర్మిషన్ లేకుండా పురుషులు ఏ పని చేయరు. పూర్తిగా స్త్రీ పెత్తనమే నడుస్తుంది. వాకింగ్ మ్యారేజ్ తర్వాత పురుషుడు ఆ రాత్రి తనను ఇష్టపడే మహిళతో ఏకాంతంగా గడుపుతాడు. సూర్యోదయానికి ముందే తిరిగి తన ఇంటికి వెళ్లిపోతాడు. ఇక్కడి పిల్లలు తల్లికి మాత్రమే రక్త సంబంధికులు, తండ్రి కేవలం వీర్యదాత మాత్రమే. పురుషులు లైంగిక కోరికలు తీర్చుకోవాలంటే రాత్రి మాత్రమే వెళ్లాలి. మహిళ పర్మిషన్ తప్పనిసరి.

ఇక్కడ మరో ఆచారం కూడా ఉంది. మహిళలు కేవలం తనకు ఇష్టమైన పురుషుడితోనే జీవితాంతం గడపాలని లేదు.. ఎవరితోనైనా ఏకాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సాంప్రదాయాన్ని 'యాక్సియా' అంటారు. ఒకవేళ ఆ పురుషుడి వల్ల మహిళ గర్భం దాల్చితే.. దాన్ని వాకింగ్ మ్యారేజ్‌గా పరిగణిస్తారు. యాక్సియా సమయంలో స్త్రీ తన ఇంటి ముందు పురుషుడి టోపీని తగిలిస్తుంది. దానార్థం ఇతర పురుషులు తన ఇంట్లోకి ప్రవేశించకూడదు అని.

మొసువో తెగ ప్రపంచం మన పురుష ప్రపంచానికి పూర్తి భిన్నం. ఇక్కడ వారసత్వంగా వచ్చే ఆస్తులు స్త్రీలకు మాత్రమే. వ్యవసాయం, ఇంటి బాధ్యతలను మహిళలే నిర్వహిస్తారు. ఇంటి పెద్దగా అమ్మమ్మలు ఉంటారు. తల్లి, మేనమామలే ఇక్కడి పిల్లల లోకం. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనే లక్ష్యం ఇక్కడి ప్రజలకు ఉండదు. లైంగిక స్వేచ్ఛ కూడా విచ్చలవిడిగా కాకుండా ఒక పద్ధతిలో సాగుతుంది. అలాగే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ జీవిస్తారు.

ప్రస్తుతం మొసువోలో పరిస్థితులు మారుతున్నాయి. చైనా ప్రభుత్వం ఇక్కడి గ్రామాలకు రోడ్లు, ఇతర మౌళిక వసతులను కల్పించింది. ఈ తెగ ప్రజలు కొందరు చైనాలోని పలు నగరాలకు వెళ్లిపోయారు. అయితే వాకింగ్ మ్యారేజ్ సాంప్రదాయం మాత్రం ఇంకా నడుస్తోంది. బయటి ప్రపంచంలో వైవాహిక జీవితాల గురించి వారికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.

Next Story