'నోర్మన్ బోర్లాగ్' ఈయన గురించి ఇప్పటి జెనరేషన్‌కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ ప్రపంచానికి ఈయన మేలు తెలిస్తే ఖచ్చితంగా సెల్యూట్ కొడతారు.
ఇప్పటితో పోలిస్తే ఒకప్పుడు ప్రపంచదేశాల్లో అభివృద్ధి చాలా తక్కువ. జనాభా మాత్రం ఎక్కువగానే ఉండేది. దీంతో చాలా దేశాల్లో తిండి లేక కోట్ల మంది చనిపోయారు. 1940 నుంచి 1960 మధ్య దాదాపు 20 సార్లు ప్రపంచవ్యాప్తంగా కరువు వచ్చింది. ఇండియాలో అయితే ప్రజలకు ఒక పూట భోజనం మానేయాలని స్వయంగా ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. అలాంటి సమయంలోనే నోర్మన్ బోర్లాగ్ ఓ ఇన్వెన్షన్ చేసి ప్రపంచం ఆకలిని తీర్చారు. కొన్ని కోట్ల మంది ఆకలితో చనిపోకుండా కాపాడారు.
తక్కువ నీటితో సాంప్రదాయ విత్తనాలకంటే 3 రెట్లు అధిక పంటనిచ్చే గోధుమ విత్తనాలకు నోర్మన్ తయారు చేశారు. వీటి వాడకం ద్వారా కేవలం రెండు సవత్సరాల్లోనే గోధుమల ఉత్పత్తి డబుల్ అయింది. గోధుమల కోసం అమెరికా మీద ఆధారపడిన మన దేశం కూడా.. దిగుమతిని నిలిపివేసింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు నోర్మన్ తయారు చేసిన హైబ్రిడ్ గోధుమ విత్తనాలను వాడటం మొదలు పెట్టాయి.
నోర్మన్ చేసిన కృషికి చాలా చేశాలు ఆయనకు వివిధ అవార్డులు ఇచ్చాయి. 1970లో ఈయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. ఇండియన్ గవర్నమెంట్ 2006లో నోర్మన్‌కు పద్మభూష్ అవార్డ్ ఇచ్చింది. అంతే కాకుండా 18 దేశాల్లోని 48 యూనివర్సిటీలు నోర్మన్‌కు గౌరవంతో డిగ్రీని అందించాయి. ఇప్పటికీ చాలా దేశాల్లో నోర్మన్ చేసిన విత్తనాలను వాడుతున్నారు.