ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే .. రాత్రుల్లో విపరీతమైన చెమ‌ట

Covid-19 new variant Omicron Symptoms.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యం అంద‌రినీ వెంటాడుతోంది. ఇది ముప్పుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2021 3:59 AM GMT
ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే .. రాత్రుల్లో విపరీతమైన చెమ‌ట

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యం అంద‌రినీ వెంటాడుతోంది. ఇది ముప్పుగా ప‌రిణ‌మిస్తోంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ శ‌ర వేగంగా వ్యాపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 63కు పైగా దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి వ్యాపించింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒమిక్రాన్ వ్యాధి తీవ్ర‌త‌, ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయ‌న్న దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాచారం అయితే ఏదీ లేదు. అయితే ఒమిక్రాన్‌ సోకిన వారిలో.. రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్‌ వెల్లడించారు.

కొవిడ్ సాధార‌ణ ల‌క్ష‌ణాలైన ద‌గ్గు, త‌ర‌చూ ముక్కు కార‌డం, గొంతు నొప్పి, తీవ్ర‌మైన జ్వ‌రం వంటివి ల‌క్ష‌ణాలు ఏమీ ఒమిక్రాన్ సోకిన వారిలో క‌నిపించ‌డం లేద‌ని డాక్ట‌ర్ ఏంజెలిక్ కాట్జీ తెలిపారు. ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధ‌ప‌డుతున్నార‌ని చెప్పుకొచ్చారు. డెల్టా వేరియంట్ సోకిన వారు వాస‌న కోల్పోగా.. ఒమిక్రాన్ బాధితుల్లో ఆ ల‌క్ష‌ణం క‌నిపించ‌డం లేద‌న‌నారు. ల‌క్ష‌ణాలు అన్ని స్వ‌ల్ప స్థాయిలోనే క‌నిపిస్తున్నాయ‌న్నారు.

అయితే.. టీకా తీసుకోని వారిలో మాత్రం త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు విప‌రీతంగా ఉంటున్నాయ‌ని చెప్పారు. అయితే.. కొంద‌రిలో మాత్రం అసాధార‌ణ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌న్నారు. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త‌తో పాటు రాత్రిపూట విప‌రీత‌మైన చెమ‌టలు ప‌డుతున్నాయని తెలిపారు. ఎంత‌లా అంటే.. ఆ చెమ‌ట కార‌ణంగా వారి దుస్తులు, బెడ్ కూడా త‌డిసిపోతున్న‌ట్లు చెప్పారు. చాలా మందిలో ఈ ల‌క్ష‌ణం క‌నిపిస్తోంద‌న్నారు.

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ద‌క్ష‌ణాఫ్రికాలో క‌నుగొన్న విష‌యం తెలిసింది. ఈ వేరియంట్‌కు చికిత్స అందిస్తున్న వారిలో డాక్ట‌ర్ ఏంజెలిక్ కూడా ఒక‌రు. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపించిన వారు వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు.

Next Story