కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి మృతి..

britan first covid vaccine taken person dead.ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన 81 ఏళ్ల విలియం షేక్స్‌పియర్‌ మంగళవారం కన్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2021 9:15 PM IST
William Shakespeare dies

మరణం ఎవరినీ విడిచిపెట్టదు. మనం అవునన్నా కాదన్న అది తన పని తను చేసుకు పోతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన 81 ఏళ్ల విలియం షేక్స్‌పియర్‌ మంగళవారం కన్నుమూశారు. ఇతను గతేడాది డిసెంబరు నెలలో యూనివర్సిటీ ఆస్ప‌త్రి కోవెంట్రీ అండ్‌ వార్విక్‌షైర్‌లో ఆయ‌న జ‌ర్మనీకి చెందిన బ‌యోఎన్‌టెక్‌, అమెరికా ఔష‌ధ సంస్థ‌ ఫైజర్ సంయుక్తంగా రూపొందించిన క‌రోనా వాక్సిన్ తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇదే ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న మృతిచెందినట్లు ఆయ‌న మిత్రుడు జైన్ ఇన్నేస్‌ వెల్ల‌డించారు.

ఈ విషయాన్ని బ్రిటన్ మీడియా ధృవీకరించింది. ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్‌ కీనన్‌ కరోనా టీకా తీసుకుని రికార్డు నెలకొల్పారు. అయితే.. పురుషుల్లో మొదట టీకా తీసుకున్న వ్యక్తి మాత్రం షేక్స్‌పియర్. వ్యాక్సిన్ వేయించుకున్న హాస్పిటల్‌లోనే అతను కన్నుమూశారు. టీకా తీసుకున్న తొలి మ‌హిళ మార్గ‌రేట్ కీన‌న్ ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నార‌ని బ్రిట‌న్ మీడియా పేర్కొన్న‌ది. వ్యాక్సిన్ వేసుకొని వెంటనే ఈ వ్యాక్సిన్ ఇక నుంచి మన జీవితాలనే మార్చేస్తుందని షేక్‌స్పియర్ వ్యాఖ్యానించారు. అయితే మారుతున్న జీవితాలను పూర్తిగా చూడకుండానే ఆయన వెళ్లిపోయారు.

కరోనా నుంచి తప్పించుకోవడానికి వాక్సిన్ తప్ప వేరే మార్గమే లేదు. అందుకే ప్రపంచమంతా కోవిడ్-19 వ్యాక్సిన్ వైపే చూస్తోంది. పకొన్ని దేశాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ దాదాపు పూర్తవ్వగా ఇండియాలో మాత్రం మందకొడిగా సాగుతోంది.

Next Story