జంతువులకి కరోనా వ్యాక్సిన్

Corona vaccine for animals.తాజాగా రష్యా మొట్టమొదటిసారిగా జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 4:55 AM GMT
Corona vaccine for animals

ఏడాదిన్నర కాలంగా మానవాళిని అట్టుడికిస్తున్న కరోనాని కట్టడి చేసేందుకు అనేక వ్యాక్సిన్లు వచ్చాయి. అయితే అవన్నీ మనుషులకే. కరోనా వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా జంతువులు కూడా కరోనా బారిన సంఘటనలు జరిగాయి. కానీ పాపం జంతువులకు కరోనా వచ్చిందో, లేదో, అవి ఎలా ఉన్నాయో ఆలోచించేంత టైం కూడా దొరకలేదు మొదట్లో.. ఇప్పుడు మనుషులకు వ్యాక్సిన్ కనిపెట్టడం, విడతలువారీగా వారికి అందివ్వటం జరగటం తో ఇప్పుడు జంతువులపై ద్రుష్టి పెట్టారు.

ఇప్పుడు తాజాగా రష్యా మొట్టమొదటిసారిగా జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది. ఈ వ్యాక్సిన్ పేరు కార్నివాక్-కోవ్. జంతువుల‌కు ఇచ్చే కోవిడ్ టీకాను ర‌ష్యా ర‌ష్యాకు చెందిన వ్య‌వ‌సాయ సంబంధిత శాఖ రూజుల్‌కోజ్‌న‌డార్ ఈ టీకాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. క్లినికల్ ట్రయల్స్ లో ఇది కుక్కలు, పిల్లులు, నక్కలు, మింక్స్ వంటి జంతువుల్లో యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్టు గుర్తించారు. వ్యాక్సిన్ వ‌ల్ల ఎటువంటి ప్ర‌మాదం లేద‌ని, ఇమ్యూనిటీ అధిక స్థాయిలో ఉన్న‌ట్లు గ్ర‌హించామ‌ని అధికారులు చెప్పారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఈ టీకా ట్ర‌య‌ల్స్ స్టార్ట్ అయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న జంతువులు నూటికి నూరు శాతం క‌రోనా వైర‌స్‌కు వ్య‌తిరేకంగా యాంటీబాడీల‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనున్నారు.

మనుషులు, జంతువుల మధ్య కరోనా వైరస్ వ్యాప్తిపై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై రష్యా అగ్రికల్చరల్ రెగ్యులేటరీ స్పందిస్తూ, జంతువుల్లో కరోనా వ్యాప్తిని ఈ వ్యాక్సిన్ అరికడుతుందని, ప్రమాదకరమైన ఉత్పరివర్తనాల నుంచి కరోనా కొత్త వేరియంట్లు తయారుకాకుండా అడ్డుకుంటుందని వివరించింది.


Next Story