తైవాన్ ను సొంతం చేసుకోడానికి అడుగులు ముందుకు వేస్తున్న చైనా
China wants to take control of Taiwan.తైవాన్ తమ దేశానికి చెందిన భూభాగం అని చైనా భావిస్తోంది. తైవాన్ మాత్రం తనకు
By M.S.R Published on 6 Nov 2021 11:15 AM ISTతైవాన్ తమ దేశానికి చెందిన భూభాగం అని చైనా భావిస్తోంది. తైవాన్ మాత్రం తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్నది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తైవాన్ తమ భూభాగమని.. అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. తైవాన్ రాజకీయ నేతలు, స్వాతంత్య్రాన్ని కాంక్షించే వారిని శిక్షిస్తామంటూ హెచ్చరించింది చైనా. బీజింగ్, తైపీల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.. తైవాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిపై చట్టాలకు అనుగుణంగా చైనా చర్యలు చేపడుతుందని బీజింగ్‌లోని తైవాన్ వ్యవహారాల కార్యాలయం హెచ్చరించింది. తైవాన్ ప్రధాని సు సెంగ్-చాంగ్, పార్లమెంట్ స్పీకర్ యూషి కున్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ తదితరులు స్వతంత్ర ఉద్యమకారులకు మద్ధతిస్తున్నారని తైవాన్ వ్యవహారాల కార్యాలయం ప్రతినిధి ఝౌ ఫెంగ్లియన్ అన్నారు.
తైవాన్ విషయంలో చైనా దూకుడును అమెరికా తీవ్రంగా తప్పుబట్టింది. కొద్దిరోజుల కిందట తైవాన్ మీద చైనా యుద్ధవిమానాలు కూడా వెళ్లాయి. అయితే చైనా తైవాన్ మీద దాడి చేస్తే అమెరికా ఏ మాత్రం సహించదని వైట్ హౌస్ నుండి ప్రకటన వచ్చింది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే, తైవాన్‌కు అండగా పోరాడుతామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొద్దిరోజుల కిందటే అన్నారు. ప్రపంచ చరిత్రలోనే అమెరికాది శక్తివంతమైన సైన్యమని చైనా, రష్యా, మిగిలిన దేశాలకు తెలుసు అని బైడెన్ అన్నారు. తైవాన్‌ను రక్షిస్తామని.. ఆ విషయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన మీడియా సమావేశంలో చెప్పారు. తైవాన్ అంశంలో తమ ప్రభుత్వ విధానంలో ఎటువంటి మార్పులేదని వైట్‌హౌజ్ ప్రతినిధి ఒకరు తెలిపారు.