ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మిలటరీ కలిగిన దేశంగా చైనా నిలిచింది. మిలటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్‌సైట్ చేసిన అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. భారీ బడ్జెట్‌లు కేటాయించిన కూడా ఈ లిస్ట్‌లో అమెరికా రెండో స్థానంలో నిలిచినట్లు ఈ స్టడీ వెల్లడించింది. ఇక ఇందులో భారత్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. 100 పాయింట్లకు గానూ చైనా మిలటరీకి 82, అమెరికాకు 74, రష్యాకు 69, భారత్‌కు 61, ప్రాన్స్ 58 సాధించి టాప్ 5లో నిలిచాయి. యునైటెడ్ కింగ్‌డమ్ 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.
ఎలా తేల్చారు..?
అల్టిమేట్ మిలటరీ స్టెంత్ ఇండెక్స్ పేరుతో జరిగిన ఈ అధ్యయనంలో బడ్జెట్, క్రియాశీలంగా ఉన్న మిలటరీ సిబ్బంది, మొత్తం గగన, సముద్ర, ఉపరితల, అణ్వాయుధ సంపత్తి, సగటు జీతాలు, పరికాల బరువు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నాయి. ప్రపంచంలో అతి ఎక్కువ మిలటరీ బడ్జెట్ మాత్రం అమెరికాదే. ఆ దేశం ఏడాదికి 73200 కోట్ల డాలర్ల బడ్జెట్‌ను రక్షణ రంగానికి కేటాయిస్తుంది. చైనా 26100 కోట్ల డాలర్లతో చైనా రెండో స్థానంలో, 7100 కోట్ల డాలర్లతో భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక సముద్ర యుద్ధంలో చైనా, గగనతలంలో అమెరికా, ఉపరితలంపై రష్యా బలంగా ఉన్నట్లు కూడా ఈ స్టడీ వెల్లడించింది.