చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది దుర్మరణం

చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  1 May 2024 1:30 PM IST
china, road collapse, 19 people dead,

 చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది దుర్మరణం 

చైనాలో ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాంగ్‌డాండ్‌ ప్రావిన్స్‌లోని ఓ హైవే రోడ్డు ఉన్నట్లుండి కుంగిపోయింది. దాంతో.. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కుప్పకూలి గుంతలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో చైనాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మీజౌ-డాబు కౌంటీ నగరాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రహదారి ఉన్నట్లుండి ఒక్కసారిగా కుంగిపోయింది. దాంతో.. ఉన్నట్లు పెద్ద గుంత ఏర్పడింది. ఇక వేగంగా వచ్చిన కొన్ని వాహనాలు ఆ గుంతలో పడిపోయాయి. దాదాపు 18 వరకు వాహనాలు అందులో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 49 వరకు గాయపడ్డారని సమాచారం. ఇక రహదారిపై రోడ్డు కుంగిన ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

దాదాపు 500 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారందరినీ రెస్క్యూ చేసి ఆస్పత్రులకు తరలించారు. సుమారు 30 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. హేవైపై రోడ్డు కుంగి ప్రమాదం జరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో కార్లు లోతైన గోతిలో పడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత అదే గోతిలో నుంచి మంటలు, పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. రోడ్డుపై భారీ గోతి ఏర్పడటంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story