చెస్‌ ఆడుతుంటే బాలుడి వేలు విరిచిన రోబో.. ఎందుకో తెలుసా?

Chess robot goes rogue breaks seven year old players finger. ఓ చెస్‌ టోర్నమెంట్‌లో అపశృతి జరిగింది. చెస్‌ ఆడుతున్న రోబో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఏడేళ్ల బాలుడి వేలు విరిచింది.

By అంజి  Published on  25 July 2022 2:30 AM GMT
చెస్‌ ఆడుతుంటే బాలుడి వేలు విరిచిన రోబో.. ఎందుకో తెలుసా?

ఓ చెస్‌ టోర్నమెంట్‌లో అపశృతి జరిగింది. చెస్‌ ఆడుతున్న రోబో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఏడేళ్ల బాలుడి వేలు విరిచింది. ఈ ఘటన రష్యా రాజధాని మాస్కోలో చోటు చేసుకుంది. తన పావును కదపడానికి ఉన్న టైమ్‌ పూర్తి కాకుండానే, బాలుడు తన పావును కదిలించే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి వేలును రోబో అదిమి పట్టింది. అక్కడే ఉన్న గేమ్‌ నిర్వాహకులు బాలుడి వేలును విడిపించారు. ఈ నెల 19న మాస్కో చెస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో ఈ ఘటన జరిగింది. బాలుడి వేళ్లు విరిగిపోయాయని నిర్వాహకులు చెప్పారు.

''ఆటలో రోబో వంతు పావు కదపడానికి సమయం ఉన్నా.. బాలుడు చెస్‌ బోర్డుపై చేయిపెట్టాడు. దీంతో ఈ ప్రమాదం జరిగింది.'' అని రష్యా చెస్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు సెర్గే స్మాగిన్ తెలిపారు. రోబో బాలుడు క్రిస్టోఫర్‌ వేలును నొక్కడం చూసి ముగ్గురు వ్యక్తులు వెంటనే పరిగెత్తుకు వచ్చారు. బాలుడి చూపుడు వేలుని రోబో నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో క్రిస్టోఫర్ వేలికి గాయం అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్రిస్టోఫర్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్లి విరిగిన వేలుకు కట్టు కట్టించారు.


Next Story