మీమ్స్ డాగ్.. 'చింటూ' ఇక లేదు
ప్రపంచ వ్యాప్తంతో మీమ్స్‌లో బాగా ఫేమస్ అయిన కుక్క చీమ్స్ అలియాస్ చింటూ చనిపోయింది.
By అంజి Published on 20 Aug 2023 3:15 AM GMTమీమ్స్ డాగ్.. 'చింటూ' ఇక లేదు
ప్రపంచ వ్యాప్తంతో మీమ్స్‌లో బాగా ఫేమస్ అయిన కుక్క చీమ్స్ అలియాస్ చింటు చనిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ శునకం నిన్న చనిపోయిందట. తెలుగులో చింటూ అనే పేరుతో వాడబడే చీమ్స్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సర్జరీ మధ్యలోనే చనిపోయింది. కొన్ని కోట్ల చింటూ మీమ్స్ మనం సోషల్ మీడియాలో చూడవచ్చు. దాదాపు పదేళ్లపాటు సోషల్ మీడియాలో కోట్ల అభిమానులను సంపాదించుకుంది ఈ శునకం మృతి వార్త విని దీని ఫ్యాన్స్ అంతా నివాళులర్పిస్తున్నారు. మీమర్స్ రెస్ట్ ఇన్ పీస్ చింటూ అంటూ సంతాపం తెలుపుతున్నారు.
మీమర్స్‌కి ఈ కుక్క చాలా కంటెంట్ ఇచ్చిందనే చెప్పాలి. మీమ్ భాషలో కుక్కకు చింటూ అనే పేరుతో బోలెడు మీమ్స్ ఉన్నాయి. ఈ మీమ్ డాగ్ బ్రీడ్ పేరు షిబా ఇను. దీనికి ఓనర్లు కబోసు అని పేరు పెట్టారు. దీని వల్ల మిలియన్ మీమ్స్ జనరేట్ అయ్యాయి. 2022లో దీనికి లివర్ సమస్యలు, లుకేమియాతో బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కుక్కలు తట్టుకోలేవు. కబోసు మరణంతో దాని ఓనర్లు ఎంతో బాధపడుతున్నారు. తమకు ఇలాంటి మరో కుక్క వద్దని కబోసు మెమొరీస్‌తోనే బతికేస్తామని అంటున్నారు.