భ‌ర్త వివాహేత‌ర సంబంధం.. వీధుల్లో పోస్ట‌ర్లు అంటించిన భార్య.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

Cheating Husband Posters Pinned All Over UK Town.భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2021 1:13 PM GMT
భ‌ర్త వివాహేత‌ర సంబంధం.. వీధుల్లో పోస్ట‌ర్లు అంటించిన భార్య.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

భ‌ర్త మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం తెలిసిన భార్య కోపంతో ర‌గిలిపోయింది. భ‌ర్త చేసిన మోసాన్ని త‌ట్టుకోలేక‌పోయింది. ఎలాగైన అత‌డికి బుద్ది చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంది. అనుకున్న‌దే త‌డ‌వుగా.. అత‌డి ఫోటో ఫ్రింట్ తీసింది. ఆ ఫోటో కింద ఇత‌డు ఓ మోస‌గాడు అంటూ రాసుకొచ్చింది. స‌ద‌రు పోస్ట‌ర్ల‌ను గోడ‌లు, కార్లు, చెట్లు ఇలా ఏది క‌నిపిస్తే దానిపైనే అతికించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

యూకేలోని ఓల్డ్‌హామ్‌కు చెందిన ఓ మహిళ భ‌ర్త.. మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష‌యం స‌ద‌రు భార్య‌కు తెలిసింది. భ‌ర్త చేసిన మోసాన్ని త‌ట్టుకోలేక‌పోయింది. భ‌ర్త ప‌రువు తీయాల‌ని భావించింది. వెంట‌నే భర్త ఫోటో పోస్ట‌ర్లు త‌యారు చేయించి ప్రింట్ తీయించింది. ఆ పోస్ట‌ర్ల‌లో భ‌ర్త ఫోటో కింద అత‌డో మోస‌గాడు. ఎవ‌రూ అత‌డిని న‌మ్మోద్దు అంటూ రాసుకొచ్చింది. ఆ ఫోస్ట‌ర్ల‌ను తాను నివాసం ఉంటున్న వీధితో ఆ ప‌ట్ట‌ణంలో చెట్లు, గోడ‌లు, డ‌స్ట్ బీన్లు ఇలా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అతికించింది. అక్క‌డితో ఆమెకు మ‌న‌శాంతి క‌ల‌గ‌లేద‌నుకుంటా.. మ‌గ‌వాళ్ల‌ను ఉద్దేశించి మ‌రికొన్ని పోస్ట‌ర్ల‌ను అతికించింది.

మీ భార్య‌ను మోసం చేస్తున్న‌ట్ల‌యితే.. త్వ‌ర‌లోనే మీ బండారం బ‌య‌ట ప‌డుతుంది. ఇక‌ భార్య‌ల‌ను ఉద్దేశించి మీ భ‌ర్త ఈ రోజు మీతోనే ఉన్నాడా..? నిన్న రాత్రి..? అంత‌క‌ముందు రాత్రి..? కూడా మీతోనే ఉన్నాడా..? ఓ సారి ఆలోచించండి అంటూ భ‌ర్త‌ల‌పై అనుమానం వ‌చ్చేలా రాసిన పోస్ట‌ర్ల‌ను అతికించింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.


Next Story