క్యాన్సర్ పేషెంట్‌కు రూ.10వేల కోట్ల జాక్‌పాట్
ఓ క్యాన్సర్ పేషెంట్‌కు అదృష్టం వరించింది. అతనికి రూ.10వేల కోట్లకు పైగా లాటరీ తగిలింది.
By Srikanth Gundamalla Published on 1 May 2024 3:47 PM ISTక్యాన్సర్ పేషెంట్‌కు రూ.10వేల కోట్ల జాక్‌పాట్
అదృష్టం ఉంటే రాత్రి రాత్రే లక్షాధికారులుగా మారిపోవచ్చు. గతంలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు లాటరీ తీసి జాక్‌పాట్ తగలడంతో తమ తలరాతనే మార్చుకున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇప్పటికీ లాటరీలు కొంటూ తమకు ఒక్కసారైనా లక్ వరించకపోతుందా అని ఎదురుచూస్తున్నవారు ఉన్నారు. తాజాగా ఓ క్యాన్సర్ పేషెంట్‌కు అదృష్టం వరించింది. అతనికి రూ.10వేల కోట్లకు పైగా లాటరీ తగిలింది. దురదృష్టవశాత్తు క్యాన్సర్‌తో పోరాడుతున్నా.. అతన్ని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
చెంగ్ సైఫాన్ అనే 46 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్ల క్రితం లావోస్ నుంచి అమెరికాకు వచ్చి స్థిరపడ్డాడు. అతనికి కొంతకాలం కిందటే క్యాన్సర్ సోకినట్లు తేలింది. దాంతో.. అప్పడి నుంచి క్యాన్సర్ బారిన నుంచి బయట పడేందుకు చికిత్స పొందుతూనే ఉన్నాడు. 8 ఏళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నాడు. దీర్ఘకాలిక క్యాన్సర్ ఉండటం వల్ల అతను ఎప్పుడు చింతిస్తూ ఉండేవాడు. తన దురదృష్టం అంతే అనుకున్నాడు. ఈ క్రమంలోనే పవర్ బాల్ లాటరీలో చెంగ్ సైఫాన్ టికెట్లు కొన్నాడు. చెంగ్ సైఫాన్, అతని భార్య, స్నేహితుడు అందరూ కలిసి 20 టికెట్లను కొనుగోలు చేశారు. ఇక ఏప్రిల్ 7వ తేదీన లాటరీ తీయగా అందులో సైఫాన్ బంపరాఫర్ కొట్టాడు.
వారు కొనుగోలు చేసిన టికెట్లలో మొత్తం 5 టికెట్లు జాక్‌పాట్ కొట్టాయి. దాంతో వారికి 1.3 బిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.108,555,252,000 గెలుచుకున్నారు. క్యాన్సర్ రూపంలో దురదృష్టం వెంటాడుతున్నా.. లాటరీ రూపంలో అదృష్టం కలిసి వచ్చిందని ఎగిరి గంతేశాడు. ఈ 1.3 బిలియన్ డార్లలో 422 మిలియన్ డాలర్లు అంఏ రూ.3500 కోట్లు ట్యాక్స్ కింద కట్ చేసి మిగిలిన సొమ్మును సైఫాన్‌కు అందించనున్నారు. ఈ మేరకు సైఫాన్ మాట్లాడుతూ.. తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని భార్య, స్నేహితుడితో పంచుకుంటానని చెపపాడు. క్యాన్సర్ కు మంచి ట్రీట్‌మెంట్ చేయించుకునేందుకు ఖర్చు చేస్తానని చెప్పాడు. కాగా.. పవర్‌బాల్ చరిత్రలోనే ఇది నాలుగో అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు వెల్లడించారు.