భారతీయ విమానాలపై ఉన్న నిషేదాన్ని కెనడా మరోసారి పొడిగించింది. ఆగస్టు 21 వరకు భారతదేశం నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు కొనసాగుతాయని మంగళవారం కెనడా ప్రభుత్వం చెప్పింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్దృతి కొనసాగుతున్న ఏప్రిల్ నుంచి భారత విమానాలపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించిందిన సంగతి తెలిసిందే. ప్యాసింజర్, బిజినెస్ విమానాలను రద్దు చేశారు. ఈ నిషేదం జులై 21తో ముగియనుంది. అయితే.. ప్రస్తుతం భారత్ లో కరోనా వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికి డెల్టా వేరియంట్ ఆందోళనకరంగా ఉండడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షలను మళ్లీ పొడిగిస్తున్నట్లు చెప్పింది.
భారత్ నుంచి నేరుగా ప్రయాణికుల విమానులను అనుమతించబోమని ఆదేశ రవాణా మంత్రి ఒమర్ అల్‌ఘబ్రా వెల్లడించారు. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి పరిస్థితులు ఇంకా తీవ్రంగానే ఉన్నాయి. ప్రజారోగ్య సంస్థ సూచనల మేరకు భారత్ నుంచి విమానాలపై నిషేదాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఆగస్టు నుంచి పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి కల్పించనున్నట్లు కెనడా చెప్పింది. థర్డ్ కంట్రీ ద్వారా భారత్ నుంచి ప్రయాణీకులు తమ దేశానికి రావొచ్చునని కెనడా చెప్పింది.