విషాదం.. మునిగిన బోటు.. 130 మంది మృతి..!
Boat Overturns in Mediterranean.మద్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బోటు నీట మునిగి పోయింది. ఈ ఘటనలో
By తోట వంశీ కుమార్ Published on 24 April 2021 6:07 AM GMT
మద్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బోటు నీట మునిగి పోయింది. ఈ ఘటనలో 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. పేదరికం, అంతరయుద్దం భరించలేక ఆఫ్రికా నుంచి చాలా మంది మెరుగైన జీవితం కోసం మధ్యధరా సముద్రాన్ని దాటి ఐరోపాలోకి అక్రమంగా చొరబడుతుంటారు. ఇందుకోసం వారు రబ్బరు బోట్లను వినియోగిస్తుంటారు. ఈ బొట్లలో పరిమితికి మించి ఎక్కిస్తుంటారు.
అలా 130 మందితో ఓ బోటు బయలు దేరింది. కొద్ది సమయం తరువాత అది మునిగిపోయింది. ఆ బోటును లిబియా రాజధాని ట్రిపోలి సమీపంలో గుర్తించారు. అయితే దగ్గరికి వెళ్లి చూడగా అందులో ప్రజలెవరూ లేరు. దానికి తోడు చుట్టూ పదికి పైగా శవాలు నీటిలో కనిపించాయి. దీంతో వారంతా మరణించారని భావించారు. కాగా.. ట్రిపోలికి తూర్పున మరో రెండు రబ్బర్‌పడవలను గుర్తించినట్లు లిబియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. దీంతో ప్రత్యేక పడవలను అక్కడికి పంపి వాటిలోని 106 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ఓ మహిళ, కొందరు పిల్లలు ఉన్నారు.