ఎవర్ గివెన్‌కు బిలియన్ డాలర్ల జరిమానా

Billions of dollars in fines for ever giving. ఎవర్ గివెన్ కార్గో నౌక యాజమాన్యానికి ఈజిప్ట్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే కానీ నౌకను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2021 4:11 AM GMT
Evergreen ship

కొద్ది రోజుల క్రితం సూయజ్ కెనాల్‌లో ఇరుక్కుపోయిన ఎవర్ గివెన్ ప్రపంచ వాణిజ్యానికి భారీ నష్టం కలిగించిన విషయం గుర్తుందికదా .. ఇప్పుడు మరోసారి ఎవర్ గ్రీన్ నౌకా హాట్ టాపిక్ గా మారింది. ఎవర్ గివెన్ కార్గో నౌక యాజమాన్యానికి ఈజిప్ట్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 1 బిలియన్ డాలర్లు చెల్లిస్తే కానీ నౌకను విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. నౌక స్థంభించటం వల్ల రోజుల తరబడి ప్రపంచ వాణిజ్యం స్థంభించిపోయింది. దాదాపు వారం రోజులు కష్టపడి డ్రెడ్జర్లు, టగ్ బోట్ల సాయంతో ఆ నౌకను ఎలాగోలా పక్కకు తెచ్చారు.. అయితే ఇప్పుడు బిలియన్ డాలర్లు ఈజిప్టు న్యాయస్థానానికి కట్టడానికి మాత్రం అధికారులు సిద్ధం గా లేదు.

సుమారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి నౌకను విడిచేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలోనే అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చలు జరుపుతోంది. గత నెల 23 న ఎవర్ గివెన్ సూయజ్ కాలువ లో ఇరుక్కు పోవడంతో వందల నౌకలు దానికి రెండు వైపులా నిలచిపోయాయి . మొత్తంగా 369 నౌకలు నిలిచిపోయినట్లు అధికారిక సమాచారం. దీనివల్ల ప్రతి రోజూ 9 బిలియన్ డాలర్లు అంటే సుమారు 65.205 కోట్లు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది . ఈ కారణంగానే బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సిందేనని ఈజీప్ట్ వారు పట్టు పట్టి కూర్చుకున్నారు. ప్రస్తుతానికి ఈ నౌక ఈజీప్ట్ ప్రభుత్వం అధీనం లో ఉంది.


Next Story