మూత్రంతో బీర్ తయారీ.. టేస్ట్‌గా ఉందని తెగ తాగేస్తున్న మందు బాబులు
Beer Made From Urine At This Singapore Brewery.ఎండలు దంచేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఓ చల్లటి బీర్ తాగుతుంటే
By తోట వంశీ కుమార్ Published on 28 May 2022 6:18 AM GMTఎండలు దంచేస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఓ చల్లటి బీర్ తాగుతుంటే ఆ కిక్కే వేరప్పా అని అంటుంటారు బీరు ప్రియులు. ఒక్కో కంపెనీ బీరు.. ఒక్కొ రకమైన రుచి ఉంటుందని చెబుతుంటారు. ఇక బీరును తయారు చేయాలంటే ఎక్కువ మొత్తంలో నీరు అవసరం. మరీ నీటి ఎద్దడి అధికంగా ఉండే సింగపూర్ లాంటి దేశంలో బీర్లను తయారు చేయాలంటే కాస్త కష్టమైన పనే అని చెప్పాలి. నీటి కొరతను అధిగమించేందుకు ఆదేశం.. డ్రైనేజీ నీళ్లయినా, మరే నీళ్లయినా సరే పూర్తిగా శుద్ధిచేసి మళ్లీ వాడాల్సిందేనని ఇప్పటికే ఆదేశించింది.
ఈ క్రమంలో మూత్రం, మురుగును నీటిని అంతర్జాతీయ ప్రమాణాలు పాటించి శుద్ధి చేసి ఆ నీటికి 'న్యూవాటర్' అని పేరు పెట్టింది. ఈ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చు. దీంతో సింగపూర్ ప్రభుత్వ వాటర్ ఏజెన్సీ పీయూబీ, స్థానిక బీరు తయారీ సంస్థ బ్రూవర్క్‌జ్ కలిసి న్యూవాటర్‌తోనే బీర్లను తయారు చేస్తున్నాయి. ఇలా తయారు చేసిన బీర్‌లకు 'న్యూబ్రూ' అని పేరు పెట్టారు. న్యూ బ్రూ బీర్ తయారీలో 90 శాతం న్యూవాటర్‌తో పాటు జర్మన్ బార్లీ మాల్ట్‌లు, సుగంధ సిట్రాతో పాటు దిగుమతి చేసుకున్న ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు. న్యూబ్రూ బీర్లను ఏప్రిల్ 8న మార్కెట్‌లో విడుదల చేశారు.
ఈ బీరు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యానికి గురి కారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇక ఈ బీర్ తాగిన వారు యమా టేస్టిగా ఉందని చెబుతున్నారు. మార్కెట్‌లోకి విడుదల చేసిన కొత్తలో అమ్మకాలు మందకోడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం విక్రయాలు జోరందుకున్నాయని ఆ కంపెనీ అధికారులు చెబుతున్నారు. మిగతా బీర్లతో పోలిస్తే.. న్యూ బ్రూ బీర్ కు అధిక డిమాండ్ ఉందని, త్వరలోనే వీటి తయారీని పెంచనున్నట్లు చెబుతున్నారు.