గవర్నమెంట్ ఆఫీసుల్లో ఐఫోన్ వాడకంపై చైనా నిషేధం

చైనాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్‌ ఫోన్లను వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2023 10:33 AM GMT
Ban, apple mobile phones, china,

గవర్నమెంట్ ఆఫీసుల్లో ఐఫోన్ వాడకంపై చైనా నిషేధం

ఐఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ధర ఎక్కువగా ఉన్నా.. వినియోగదారులు చాలా వరకు వాటినే చూస్‌ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే.. మిగతా వాటితో పోలిస్తే అన్నింట్లోనూ సేఫ్‌ అండ్ సెక్యూర్. ఇక అమెరికా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్‌ ఫోన్లను వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. నిషేధం విధించడంతో అక్కడున్న ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

అయితే.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్‌ ఐఫోన్లతో పాటు.. ఇతర విదేశీ బ్రాండ్‌ డివైజ్‌ల వాడకంపైనా చైనా నిషేధం విధించింది. ఈ డివైజ్‌లను కార్యాలయాల్లో వాడకూడదని.. వాటిని కార్యాలయాలకు తీసుకురావొద్దని ఉద్యోగులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఐఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉన్నతాధికారులకు ఉత్తర్వుల్లో పలు సూచనలు చేసింది. ఐఫోన్ 15 లాంఛ్ ఈవెంట్ మ‌రికొద్ది వారాల్లో జ‌ర‌గ‌నుండ‌గా చైనా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఐఫోన్ల వాడ‌కంపై నిషేధం విధించ‌డం చర్చనీయాంశంగా మారింది. చైనాలోని పనిచేస్తున్న విదేశీ కంపెనీల్లో ఈ పరిణామం గుబులు రేపుతోంది. యాపిల్‌తో పాటు నిషేధించిన ఇతర బ్రాండ్లు ఏంటనేది వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

కాగా.. చైనాలో ఐఫోన్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై.. చైనా స్టేట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్‌ ఆఫీస్‌, యాపిల్ కంపెనీ ఇప్పటి వరకూ స్పందించలేదు. డేటా భద్రతపై ఇటీవల పలు చర్యలు చేపడుతున్న చైనా కంపెనీలకు నూతన నిబంధనలు, ప్రమాణాలను ప్రభుత్వరం నిర్దేశిస్తోంది. ఇక అమెరికన్ టెక్‌ దిగ్గజాలకు చెక్ పెట్టేందుకు దేశీయ కంపెనీలను టెక్నాలజీలో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సాహం అందిస్తోంది చైనా ప్రభుత్వం.

Next Story