ఏడుగురు పాక్ సైనికులను బంధించారు.. డిమాండ్స్ ఇవే..!

పాకిస్థాన్ సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టుకుంది. ఖుజ్దార్‌లోని ఓరాంచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఏడుగురు సిబ్బందిని తమ యోధులు పట్టుకున్నారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది.

By -  Medi Samrat
Published on : 16 Feb 2026 2:56 PM IST

ఏడుగురు పాక్ సైనికులను బంధించారు.. డిమాండ్స్ ఇవే..!

పాకిస్థాన్ సైనికులను బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టుకుంది. ఖుజ్దార్‌లోని ఓరాంచ్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఏడుగురు సిబ్బందిని తమ యోధులు పట్టుకున్నారని బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. ఆ సంస్థ మీడియా విభాగంగా గుర్తింపు పొందిన హక్కల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, సైనికులను అదుపులోకి తీసుకున్నామని, ఖైదీల మార్పిడి కోసం ఏడు రోజుల అల్టిమేటం జారీ చేసినట్లు ఆ సంస్థ తెలిపింది.

ఒక వీడియోలో పాకిస్తాన్ సైనిక యూనిఫాంలో ఏడుగురు వ్యక్తులు మోకాళ్లపై ఉన్నట్లు కనిపిస్తోంది. వీడియో బైట్‌లో ఉన్న వారిలో ఒకరు తనను తాను పాకిస్తాన్ సైనికుడిగా గుర్తించుకుంటూ, 2022 అక్టోబర్‌లో తాను రిక్రూట్ అయ్యానని, కరాచీకి సెలవుపై ఇంటికి వెళుతుండగా BLA తనను అపహరించిందని వాపోయాడు. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికుల నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా వీడియోలో చూడొచ్చు.

Next Story