ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి

Author Salman Rushdie attacked on stage.భారత సంతతికి చెందినప్ర‌ముఖ ర‌చ‌యిత సల్మాన్ రష్డీపై శుక్ర‌వారం అమెరికాలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Aug 2022 1:37 AM GMT
ర‌చ‌యిత స‌ల్మాన్ ర‌ష్డీపై దాడి

భారత సంతతికి చెందినప్ర‌ముఖ ర‌చ‌యిత సల్మాన్ రష్డీపై శుక్ర‌వారం అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో దాడి జ‌రిగింది. చౌటౌక్వా ఇన్‌స్టిట్యూట్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించేందుకు స‌ల్మాన్ హాజ‌ర‌య్యారు. ఆయ‌న ప్ర‌సంగిస్తుండ‌గా.. ఓ ఆగంత‌కుడు ఒక్క సారిగా స్టేజ్ పైకి ఒక్క‌సారిగా దూసుకువ‌చ్చాడు. క‌త్తితో ప‌లుమార్లు పొడిచాడు. ఈ ఘ‌ట‌న‌లో సల్మాన్ రష్డీ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అక్క‌డున్న వారు ఆ ఆగంతుని ప‌ట్టుకుని పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు ఆగంతకుడిని అరెస్ట్ చేసి.. సల్మాన్ ను అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ఆస్ప‌త్రికి త‌రలించారు. దాడికి గ‌ల కార‌ణాలు తెలియ‌రాలేదు.

ఇరాన్‌లో ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ ఆయ‌న రాసిన 'ది సాటానిక్‌ వెర్సెస్‌' న‌వ‌ల వివాదాస్ప‌ద‌మైంది. 1988లో ఇరాన్‌లో ఈ నావెల్‌ను నిషేదించారు. ఆయ‌న్ను చంపేస్తామ‌ని బెదిరింపులు కూడా వ‌చ్చాయి. ఇస్లామిక్‌ సంఘాలు ఫత్వా కూడా జారీ చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది.

Next Story