పుషప్స్ లో సరికొత్త ప్రపంచ రికార్డు.. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

Australian man breaks Guinness World Record for most push-ups in an hour. పుష్-అప్‌లు ఛాతీ, అప్పర్ బాడీకి మంచి స్ట్రెంత్ ను ఇచ్చే గొప్ప వ్యాయామం.

By M.S.R  Published on  15 April 2023 2:00 PM GMT
పుషప్స్ లో సరికొత్త ప్రపంచ రికార్డు.. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

పుష్-అప్‌లు ఛాతీ, అప్పర్ బాడీకి మంచి స్ట్రెంత్ ను ఇచ్చే గొప్ప వ్యాయామం. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లే వ్యక్తులు సాధారణంగా కొన్ని సెట్ల పుష్ అప్స్ చేస్తారు. ఒక మనిషి గంటలో ఏక ధాటిగా ఎన్ని పుష్-అప్‌లు చేయగలడో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లూకాస్ హెల్మ్కే ఒక గంటలోపు 3,206 పుష్ అప్‌లను చేసి.. ఒక గంటలో అత్యధిక పుష్ అప్‌ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. యావరేజ్ గా నిమిషానికి 53 కంటే ఎక్కువ పుష్-అప్ లను చేసినట్లుగా రికార్డు సృష్టించాడు.

ఈ రికార్డు గురించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదని లూకాస్ హెల్మ్కే తన కుమారుడికి తెలియజేయాలని అనుకుని ఈ రికార్డును ప్రయత్నించాడు. 2022 ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన డేనియల్ స్కాలీ పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు లూకాస్ బద్దలుకొట్టాడు. ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు లూకాస్ రెండు మూడు సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్నాడు. బ్రిస్బేన్‌లోని పవర్‌లిఫ్టింగ్ జిమ్ ఐరన్ అండర్‌గ్రౌండ్‌లో ఈ రికార్డ్ ను బద్దలు కొట్టే ఈవెంట్ జరిగింది. ఒక గంటలో అత్యధిక పుష్ అప్‌ల రికార్డు గత దశాబ్దంలో పదే పదే బద్దలైంది. లూకాస్, స్కాలీకి ముందు, ఈ రికార్డును మరొక ఆస్ట్రేలియన్, జరాడ్ యంగ్ కలిగి ఉన్నాడు.


Next Story