మొన్న జరిగిన ఇండోనేషియా విమాన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే.. ఇప్పుడు క్యూబాలో ఓ హైలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. క్యూబాలోని హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున హెూల్విన్ ప్రావిన్స్ నుంచి గ్వాంటనామో ద్వీపానికి హెలికాఫ్టర్ బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలోని ఓ కొండపై హెలికాప్టర్ కుప్పకూలిపోయిందని ఆదేశ సాయుధ దళాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. వారంతా మరణించారని వెల్లడించింది.
ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదని.. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఓ కమిషన్‌ను ఏర్పాట్లు చేసినట్లు క్యూబా సాయుధ దళాల మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా.. 2018లో హవానా విమానాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదంలో 112 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.