బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన కాల్పుల ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, మాదక ద్రవ్యాల ముఠా మధ్య ఈ కాల్పులు జరిగాయి. మృతులలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నారు.
రియో డి జనరీలోని జకారీ జిన్హో ప్రాంతంలో మాదక ద్రవ్యాల ముఠాలలో చిన్న పిల్లలను చేర్చుకుంటున్నారన్న ఫిర్యాదులు రావడంతో రంగం లోకి దిగిన పోలీసులు ఏకంగా ఆ ముఠా స్థావరానికే వెళ్లి వారికి సమన్లు ఇచ్చి అరెస్టులకు ప్రయత్నించారు. అయితే ముఠా సభ్యులు అందుకు అంగీకారించక దాడికి దిగారు. ఈ ఘటనలో మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు కూడా తూటాలు తగిలాయి. అయితే వారు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ముఠా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు హత్యలు, కిడ్నాప్‌లు కూడా చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. నిజానికి రియో డి జనీరలో అత్యధిక ప్రాంతం నేరగాళ్ల అధీనంలోనే ఉంటుందని సమాచారం. చాలా కాలం తరువాత జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇదని ఇక్కడి లోకల్ మీడియా చెబుతోంది