అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహం.. అక్కడ అన్నీ నీళ్లే.!

Astronomers have discovered a new Earth-like planet in space. భూమిపై మాత్రమే జీవం ఉందా? అంతరిక్షంలో మనం ఒంటరిగా ఉన్నామా? మానవ జాతి భవిష్యత్తును తట్టుకుని నిలబడేందుకు

By అంజి  Published on  26 Aug 2022 3:18 PM IST
అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహం.. అక్కడ అన్నీ నీళ్లే.!

భూమిపై మాత్రమే జీవం ఉందా? అంతరిక్షంలో మనం ఒంటరిగా ఉన్నామా? మానవ జాతి భవిష్యత్తును తట్టుకుని నిలబడేందుకు సహాయపడే గ్రహం ఏదైనా ఉందా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం కోసం కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ అంతరిక్ష పరిశోధనల్లో ఎన్నో వింతలు, విశేషాలు బయటపడుతూనే ఉన్నాయి. అంతరిక్షంలోని వేరే గ్రహాలపై జీవం ఉందా? లేదా అక్కడ జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? అనే విషయమై సమాధానం దొరకబట్టేందుకు శాస్త్రవేత్తలు పట్టువదలని విక్రమార్కుల్లా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా యూనివ‌ర్సిటీ ఆఫ్ మాంట్రియ‌ల్‌కు చెందిన ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు.. అంతరిక్షంలో సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్ర‌హాన్ని గుర్తించారు. ఇది భూమి నుంచి 100 కాంతి సంవ‌త్స‌రాల‌ దూరంలో ఉంది. ఇది భూమికంటే సుమారు 70 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ గ్రహానికి 'టాయ్‌-1452బీ' అని శాస్త్రవేత్తలు నామ‌క‌ర‌ణం చేశారు. ఈ కొత్త గ్రహంపై సంవత్సరం అంటే 11 రోజులే అని పరిశోధనకు నేతృత్వం వహించిన చార్లెస్‌ కాడియక్స్‌ తెలిపారు. ఇది రెండు నక్షత్రాల చుట్టూ తిరుగుతోందని చెప్పారు.

టాయ్‌-1452బీ గ్రహం భూమి కంటే 5 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. ఈ గ్రహం పూర్తిగా నీటితో నిండి ఉంది. గ్రహం మొత్తం బరువులో 30 శాతం నీరే ఉంది. అందుకే ఈ గ్రహాన్ని సముద్ర గ్రహం అని కూడా పిలువొచ్చిన కాడియక్స్‌ చెప్పారు. ఇందులో ఒక నక్షత్రం చుట్టూ తిరిగేందుకు దాదాపు 1400 ఏళ్ల సమయం పడుతుంది. మరో నక్షత్రం నుంచి దీనికి కాంతి అందుతుంది. అయితే ఈ గ్రహంపై జీవం ఉందా? లేదా? అనేది తెలుసుకోవాల్సి ఉంది. దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని కాడియక్స్‌ చెప్పారు. ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌తో గ్రహాన్ని వివరంగా అధ్యయనం చేయనున్నారు.

Next Story