ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇకపై అంతరిక్షంలోనూ తినొచ్చు!

అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొచ్చా? అసలు అక్కడ వంట చేసుకోవడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమధానాన్ని

By అంజి  Published on  8 Jun 2023 7:32 AM IST
Astronauts, french fries , space,  ESA

ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇకపై అంతరిక్షంలోనూ తినొచ్చు!

అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొచ్చా? అసలు అక్కడ వంట చేసుకోవడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమధానాన్ని కనుగొన్నారు. మనం భూమి మీద ఎలాగైతే వేడి వేడిగా.. కరకరలాడే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను తిన్నట్లే, అంతరిక్షంలోనూ వ్యోమగాములు.. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ని వేయించుకుని తినొచ్చు. అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొచ్చా? అనే అంశంపై యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. వారు చేసిన ప్రయోగాల ఫలవంతం అయ్యాయి. ఇక నుంచి అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు నూతన పద్ధతుల్లో ఆహారాన్ని వండుకోనున్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా బంగాళదుంప ముక్కలను వేయిస్తున్నారు. అలాంటప్పుడు అంతరిక్షంలో ఎందుకు వేయించకూడదు? అనే ప్రశ్నకు సమాధానంగానే తాము ఈ ప్రయోగాన్ని చేపట్టామని పరిశోధాన బృందం తెలిపింది. తాము ప్రయోగం కోసం రెండు విమానాల్లో గురుత్వాకర్షణ లేని చోటుకు వెళ్లామని, అక్కడే ఒక ప్రత్యేకమైన గుండ్రంగా తిరిగే పరికరంలో ఆయిన్‌ను బయటకు రాకుండా వేడిచేసి, అందులో బంగాళదుంప ముక్కలు వేశామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆయిల్‌ బుడగల రూపంలో వాటి చుట్టూ చేరిందని, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత ఆయిల్ బుడగలు వాటి నుంచి వేరయ్యాయని పరిశోధనా బృందం తెలిపింది. ఈ ఆవిష్కరణతో వ్యోమగాములు అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటిని నూనెలో వేయించుకుని తినవచ్చని తెలిపారు. త్వరలోనే ఈ ప్రయోగాన్ని పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేస్తామని ఈఎస్‌ఏ తెలిపింది.

Next Story