ప్ర‌మాద‌క‌ర‌మైన గ్ర‌హ‌శ‌క‌లం.. నేడు భూమికి అతి చేరువ‌గా

Asteroid speeding at 94,000 kmph to approach Earth on Aug 21.అంత‌రిక్షంలో కోట్ల కొద్ది గ్ర‌హ‌శ‌క‌లాలు ఉన్నాయి. అందులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Aug 2021 3:59 AM GMT
ప్ర‌మాద‌క‌ర‌మైన గ్ర‌హ‌శ‌క‌లం.. నేడు భూమికి అతి చేరువ‌గా

అంత‌రిక్షంలో కోట్ల కొద్ది గ్ర‌హ‌శ‌క‌లాలు ఉన్నాయి. అందులో కొన్ని భూమి వైపుకు దూసుకువస్తున్నాయి. వాటిలో ఒక‌టి రెండు మాత్ర‌మే భూమిని ఢీ కొట్టే అవ‌కాశ‌లున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మిగ‌తావి భూమికి స‌మీపంలో నుంచి వెలుతాయ‌ని చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. తాజాగా గంట‌కు 94 వేల కిలోమీట‌ర్ల వేగంతో ఓ గ్ర‌హ‌శ‌క‌లం భూమి వైపుకు దూసుకువ‌స్తోంది. దీనిని ఖగోళ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. దీన్ని ప్ర‌మాద‌క‌ర‌మైన అంత‌రిక్ష శిల‌గా పేర్కొన్నారు.

అయితే.. ప్ర‌స్తుతానికి దీని వ‌ల్ల ఎలాంటి హాని ఉండ‌బోద‌ని, ఈ రోజు( ఆగ‌స్టు 21న‌) అది భూమికి అత్యంత స‌మీపంగా వ‌చ్చి వెలుతుంద‌ని నాసా తెలిపింది. దీనికి 2016 ఏజే193గా పేరు పెట్టారు. ఈ గ్రహశకలం 5.91 సంవత్సరాల కక్ష్యలో సూర్యుడి వైపు దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. ఈ గ్రహశకలం ఒక మైలు వెడల్పు (1.4 కిలోమీటర్ల వెడల్పు) కంటే తక్కువగా ఉంటుందని అంచనా. సుమారు 4,500 అడుగుల వ్యాసంతో ఉంటుంది. ఇది త‌న కక్ష్య‌లో ప‌రిభ్ర‌మిస్తూ.. శ‌నివారం భూమికి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి వెలుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఆ స‌మ‌యంలో దానికి భూమికి మ‌ధ్య ఉన్న దూరం.. పుడ‌మికి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరంతో పోలీస్తే 9 రెట్లు ఎక్కువ‌ని చెప్పారు. మ‌ళ్లీ ఇది 2063లో మ‌రోసారి భూమికి ద‌గ్గ‌ర‌గా రానుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 2016 జ‌న‌వ‌రిలో హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జ‌ర్వేట‌రీ సాయంతో ఈ గ్ర‌హ‌శ‌క‌లాన్ని గుర్తించారు.

నియోవైస్ అనే వ్యోమ‌నౌక సాయంతో దీన్ని నాసా నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఇది 5.9 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి సూర్యుడిని చుట్టి వ‌స్తుంద‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాసా 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించింది. అందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా గుర్తించింది.

Next Story