సెలవు కోసం కిడ్నాప్ డ్రామా.. జాబ్ పోయింది.. అరెస్ట్.. ఇంకా
Arizona man faked kidnapping get out work.ఓ వ్యక్తి సెలవు కోసం అబద్దం చెప్పాడు. దీంతో అతడి జాబ్ పోయింది.
By తోట వంశీ కుమార్ Published on 24 Feb 2021 1:16 PM ISTఅబద్దం చెప్పకూడని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. ఒక అబద్దం చెబితే.. దాన్ని కవర్ చేయడానికి మరో అబద్దం.. ఆ అబద్దాన్ని కవర్ చేయడానికి మరో అబద్దం.. ఇలా అబద్దాలు చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. అబద్దాలు అనర్థాలకు దారి తీస్తాయి. ఓ వ్యక్తి సెలవు కోసం చెప్పిన అబద్దం చెప్పాడు. దీంతో అతడి జాబ్ పోయింది. అంతేనా అతడిని కటకటపాలు చేసింది. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల బ్రాండన్ సోల్స్ అనే వ్యక్తి అమెరికాలోని అరిజోనాలో నివసిస్తున్నాడు. అతడు ఓ టైర్ల కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి సెలవు కావాల్సి వచ్చింది. సరియైన కారణం లేకపోవడంతో అతడికి సెలవు ఇచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో సోల్స్ కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. చేతులు కట్టేసుకుని, నోట్లో గుడ్డలు కుక్కుకోని ఓ చెట్ల పొదల మధ్య పడుకున్నాడు. అటుగా వెలుతున్న ఓ వ్యక్తి ఇది గమనించి అతడి చేతులకు ఉన్న కట్లు విప్పి.. ఎం జరిగిందని ఆరా తీయగా.. తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పాడు.
వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సోల్స్ ను విచారించగా.. తనను ఇద్దరు కిడ్నాప్ చేశారని.. తన తండ్రి నగరంలో వివిధ చోట్ల డబ్బులు, నగదు దాచుకోవడంతో వాటిని చూపించాలని తనను తీసుకొచ్చి ఇక్కడ పడవేశారని చెప్పాడు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తి చెప్పేవన్ని అబద్దాలు అని గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు నిజం చెప్పాడు. ఈ విషయం సదరు కంపెనీకి తెలియడంతో.. అతడిని వెంటనే ఉద్యోగంలోంచి తీసివేసింది. సోల్స్‌ను కోర్టులో హాజరుపరచగా.. 500 డాలర్ల జరిమానా విధించారు.