క‌స్ట‌మ‌ర్ రిక్వెస్ట్‌.. స్టోర్ ఓన‌ర్ షాక్‌.. నేను డ‌జ‌న్ అడిగితే.. మీరు ప‌న్నెండే పంపారు

Angry Customer demands refund after ordering a dozen masks receiving only 12.నేను డ‌జ‌న్ మాస్కులు ఆర్డ‌ర్ ఇస్తే.. మీరు 12 మాస్కుల‌నే పంపారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 March 2021 3:53 PM IST

Angry Customer demands refund after ordering a dozen masks receiving only 12

అస‌లు ఇదేమైనా బాగుందా ఇది.. నేను డ‌జ‌న్ మాస్కులు ఆర్డ‌ర్ ఇస్తే.. మీరు 12 మాస్కుల‌నే పంపారు. నా డ‌బ్బులు నాకు తిరిగి పంపించండి లేదంటే మిగ‌తా మాస్కులైనా పంపించండి.. ఇక నుంచి మీ బిజినెస్‌కు నేను స‌పోర్ట్ ఇవ్వ‌ను. బ్లాక్ వాళ్లు న‌డిపే స్టోర్ల‌కు నేను స‌పోర్ట్ ఇద్దామ‌ని అనుకున్నాను. కానీ మీరు మాత్రం ప్ర‌జ‌ల‌ను దోచుకుంటూనే ఉన్నారంటూ అమెరికాలోని ఓ క‌స్ట‌మ‌ర్ తాను ఆర్డ‌ర్ చేసిన స్టోర్ ఓన‌ర్‌కు ఈమెయిల్ పంపించాడు. ఇది చూసిన ఆ స్టోర్ య‌జ‌మానికి దిమ్మ‌దిరిగింది. అదేంటీ డ‌జ‌న్ అంటే 12 డే క‌దా.. బిల్లులో ఏమైన త‌ప్పిదం జ‌రిగిందా అ‌ని అత‌డికి పంపిన బిల్లును ఒక‌టి రెండు సార్లు ప‌రిశీలించాడు. బిల్లు కూడా క‌రెక్టుగానే ఉంది.

మరోసారి ఆ మెయిల్‌ను చదివింది మిన్నెసొటాలోని చిన్న స్టోర్‌కు ఓన‌ర్‌గా ఉన్న జాడా మెక్‌క్రే. వెంట‌నే క‌స్ట‌మ‌ర్‌కు తిరిగి రిప్లే మెయిల్ పంపించింది. డ‌జ‌న్ అంటే ప‌న్నేండే క‌దా.. మేము కూడా 12 మాస్కుల‌కే బిల్లు వేశాం. మీకు రిఫండ్ ఇవ్వ‌డం కుద‌ర‌దు అని పంపింది. అవునా.. నిజానికి నాకు 20 మాస్కులు కావాలి. నేను బిల్లు స‌రిగా చూడ‌లేద‌నుకుంటా. నేను డ‌బ్ (20) జ‌న్ అని అన్నాను అంటూ రిప్లై ఇచ్చాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ ఘ‌ట‌న మెక్‌క్రే స్టోర్‌కు బాగానే పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ప్ర‌స్తుతం ఆర్డ‌ర్ల మీద ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి. రోజుకు 30కి పైగా ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ని జాడా మెక్‌క్రే చెప్పింది. ‌

ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ట్విట‌ర్‌లో వైర‌ల్ కాగా.. ఈ దెబ్బ‌తో మెక్‌క్రే స్టోర్‌కు కూడా డిమాండ్ పెరిగిపోయింది. గ‌తంలో అప్పుడోఇప్పుడో ఆర్డ‌ర్లు వస్తుండేవ‌ని, ఈ ఘ‌ట‌న త‌ర్వాత రోజుకు 30 ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ని ఆమె చెప్ప‌డం విశేషం.




Next Story