భారతీయ మహిళలపై అమెరికన్‌ జాత్యంహకార దాడి.. అరెస్ట్‌

American woman's racist attack on Indian women in Texas.. Arrested. అమెరికాలో భారతీయ మహిళలపై జాతి వివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన ఓ మహిళ పార్కింట్‌ లాట్‌లో భారతీయ

By అంజి  Published on  26 Aug 2022 5:24 AM GMT
భారతీయ మహిళలపై అమెరికన్‌ జాత్యంహకార దాడి.. అరెస్ట్‌

అమెరికాలో భారతీయ మహిళలపై జాతి వివక్ష దాడి జరిగింది. మెక్సికన్‌కు చెందిన ఓ మహిళ పార్కింట్‌ లాట్‌లో భారతీయ మహిళలపై అటాక్‌ చేసింది. ఈ ఘటన టెక్సాస్‌లోని ప్లానోలోని సిక్స్టీ వైన్స్ రెస్టారెంట్ వెలుపల జరిగింది. మెక్సికన్‌ మహిళ భారతీయులను బూతులు తిట్టింది. ఇండియాకు వెళ్లిపోవాలంటూ మాట్లాడింది. తాను ఇండియ‌న్ల‌ను ద్వేషిస్తాని, బెట‌ర్ లైఫ్ కోస‌మే ఇండియన్లు అమెరికా వ‌స్తుంటార‌ని ఆమె అన్న‌ది. భారతీయ - అమెరికన్ మహిళలపై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ.. అరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐదున్నర నిమిషాల వీడియోలో.. భారతీయుల పట్ల ద్వేషాన్ని అదుపు చేసుకోలేక మెక్సిన్‌ మహిళ.. భారతీయ మహిళ ముఖంపై కొట్టడం, సంఘటనను చిత్రీకరిస్తున్న ఇద్దరు మహిళల ఫోన్‌లను కింద పడేయడం చేసింది. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడింది. ప్లానో పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. భార‌తీయుల‌పై చేయి చేసుకున్న ఆ మ‌హిళ‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ మెక్సిక‌న్ మ‌హిళ‌ను ఎస్మ‌రాల్డో ఉప్ట‌న్‌గా గుర్తించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ సంఘటనను ద్వేషపూరిత నేరంగా పరిగణిస్తున్నాం అని పోలీసులు తెలిపారు.

ఆగస్టు 25 గురువారం సుమారుగా మధ్యాహ్నం 3:50 గంటలకు.. ప్లానో పోలీసు డిటెక్టివ్‌లు మెక్సికన్‌ హిళ ఎస్మెరాల్డా అప్టన్‌ను దాడికి, బెదిరింపులకు పాల్పడినందుకు అరెస్టు చేశారు. దాడికి సంబంధించిన వీడియో అమెరికాలోని ఇండియ‌న్ క‌మ్యూనిటీలో వైర‌ల్ అయ్యింది. తాను అమెరికాలో పుట్టిన‌ట్లు చెప్పిన ఆ మెక్సిక‌న్ మ‌హిళ చాలా దురుసుగా ప్ర‌వ‌ర్తించింది. నేను ఎక్క‌డ‌కు వెళ్లినా అక్క‌డ ఇండియ‌న్లు క‌నిపిస్తుంటార‌ని, ఒక‌వేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్క‌డకి ఎందుకు వ‌చ్చిన‌ట్లు ఆమె అరించింది.

"నేను ఎక్కడికి వెళ్లినా.. అక్కడ భారతీయులు ఉంటున్నారు" అని అప్టన్ వీడియోలో చెప్పడం వినవచ్చు. "భారతదేశంలో జీవితం చాలా గొప్పగా ఉంటే, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలకు అటువైపున ఉన్న మహిళల్లో ఒకరు తనదైన వ్యాఖ్యతో ఫైర్ అయ్యారు. "మీరు మెక్సికన్ అయితే, మీరు ఎందుకు మెక్సికోకు తిరిగి వెళ్లకూడదు." కెమెరా వెనుక ఉన్న వ్యక్తి చెప్పడం వినవచ్చు.


Next Story