America: అధ్యక్ష రేసులో నేనే ఉన్నా.. బైడెన్ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on  4 July 2024 12:42 PM IST
America, president election,  biden, clarity,

America: అధ్యక్ష రేసులో నేనే ఉన్నా.. బైడెన్ క్లారిటీ

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఈ సారి పోటీ నుంచి తప్పుకుంటారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. గతవారం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌తో జరిగిన సంవాదంలో బైడెన్ తడబడ్డాడు. దీన్ని బైడెన్ కూడా అంగీకరించారు. ఈ క్రమంలో బైడెన్ గెలుపుపై స్వపక్షంలోనే ఆందోళనలు వచ్చాయి. ఆయన్ని తప్పించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేశాయని తెలిసింది. ఈ క్రమంలోనే బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతారని వార్తలు వచ్చాయి. బైడెన్‌ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. డెమోక్రాటిక్ పార్టీ తరఫున రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తానే పోటి చేసేది అని స్పష్టం చేశారు.

ఈ మేరకు మాట్లాడిన బైడెన్.. 'అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి డెమోక్రాటిక్ పార్టీ నామినీని నేనే. నన్నెవరూ తప్పుకోమనడం లేదు. నేను కూడా పోటీ నుంచి వైదొలగడం లేదు. తుది వరకు పోరాడుతా. మనమే గెలవబోతున్నాం. ట్రంప్‌ను ఓడించేందుకు మాకు అండగా నిలవండి.' అని మద్దతుదారులకు రాసిన లేఖలో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నాడు. అలాగే విరాళాలు అందజేయాలంటూ విజ్ఞప్తి చేశారు.జీవితాలో చాలా సార్లు కింద పడ్డా మళ్లీ పైకి లేచానని బైడెన్ తన లేఖలో పేర్కొన్నారు. ఎన్నిసార్లు కిందపడ్డామన్నది కాదు.. ఎంత వేగంగా కోలుకున్నామనేదే ముఖ్యమని ఆయన అన్నారు. ఇదే విషయం తన తండ్రి నేర్పించారని పేర్కొన్నాడు. 2020లో లాగే ట్రంప్‌ను ఇప్పుడు కలాహ్యారిస్‌తో కలిసి నేను ఓడించబోతున్నా అంటూ బైడెన్ లేఖలో రాసుకొచ్చారు.

మరోవైపు అమెరికా వైట్‌హౌస్ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడం లేదని తెలిపింది. ఆయన ప్రస్తుతం రాజకీయ జీవితంలో అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

Next Story