అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారిస్ ఖరారు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది నెలలే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  27 July 2024 3:45 AM GMT
America, president election, democratic party,  kamala harris,

 అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారిస్ ఖరారు

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది నెలలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ట్రంప్‌ రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో కన్ఫామ్‌ అయ్యారు. ఇక ఇటీవల డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దాంతో.. నెక్ట్స్‌ బరిలో ఎవరు నిలబడతారని ఉత్కంఠ కొనసాగింది. కమలా హారిస్‌నే ఎంచుకుంటారని వార్తలు వచ్చాయి. ఆమె కూడా అందుకు తగినట్లుగానే ప్రచారం చేశారు. మద్దతు కూడగట్టుకున్నారు. తాజాగా అమెరికా అధ్యక్ష బరిలో ఉన్నానంటూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.

డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్‌ ఖరారయ్యారు. ఈ విషయాన్ని కమలా హారిస్ ఎక్స్‌ లో అధికారికంగా తెలిపారు. దీనికి సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు ప్రకటన చేశారు. ఇక అధ్యక్ష రేసులో గెలిచేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని అన్నారు. అన్ని పొందేందుకు కృషి చేస్తానన్నారు. నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తోన్న ప్రచారమే గెలుస్తుందని కమలా హారిస్‌ పేర్కొన్నారు. కమలాహారిస్‌ వివిధ పక్షాల మద్దతు కూడగట్టి డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. కాగా.. కమలాహారిస్‌ భారత మూలాలున్న వ్యక్తి. తమిళనాడులో ఆమె తాతలు ఉన్నారు. మరోవైపు ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ బరిలో నిలబడాలనీ.. గెలవాలంటూ ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇక కమలా హారిస్‌ అద్యక్ష రేసులో ఉంటే ఆమెను ఓడించడం తమకు మరింత సులువు అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి మున్ముందు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది చూడాలి.


Next Story