అమెరికాలో పోలీసుల తూటాకు 13 ఏళ్ల బాలుడు బలి

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు అమెరికా పోలీసుల తూటాకు బలయ్యాడు.

By Srikanth Gundamalla  Published on  1 July 2024 7:07 AM IST
america, 13 years boy, killed,  police,

అమెరికాలో పోలీసుల తూటాకు 13 ఏళ్ల బాలుడు బలి 

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఒక 13 ఏళ్ల బాలుడు అమెరికా పోలీసుల తూటాకు బలయ్యాడు. తుపాకీ చూపించి డబ్బులు దోచుకుంటున్న ఒక ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఓ పిల్లాడిని పొట్టనపెట్టుకున్నారు. స్థానిక మీడియా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యుటికాలో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రాత్రి సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు టీనేజర్లను పోలీసులు ఆపారు. వారి దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. వారిలో 13 ఏళ్ల న్యాహ్‌ ఎంవా భయంతో ఒక్కసారిగా అక్కడినుంచి పరుగెత్తడం ప్రారంభించాడు. దాంతో పోలీసులు వెంటపడ్డారు. దాంతో. పిల్లాడు తన దగ్గరున్న బొమ్ పెల్లెట్‌ గన్‌తో పోలీసులను బెదిరించాడు.

పిల్లాడు చూపించిన గన్‌ను నిజమైనదిగా భావించాడు ప్యాట్రిక్‌ హష్నే అనే పోలీసు. దాంతో.. ఆ పోలీసు పిల్లాడిని కిందపడేసి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. మరో ఇద్దరు పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాటలో పిల్లాడిని ప్యాట్రిక్‌ షూట్ చేశాడు. దాంతో.. తుటా పిల్లాడి శరీరంలోకి దిగింది. ఆ తర్వాత పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ.. అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఉదంతం ఓ పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది. వారి అతి జాగ్రత్తలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతామని.. సిటీ మేయర్ హామీ ఇచ్చారు. అంతర్గత కలహాలతో రగిలిపోతున్న మయన్మార్‌ నుంచి పిల్లాడి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చినట్లు తెలిసింది.

Next Story