271 మందితో వెళ్తున్న విమానం.. మధ్యలో స్పృహా కొల్పోయిన పైలట్.. ఆ తర్వాత
ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో పైలట్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
By అంజి Published on 17 Aug 2023 11:20 AM IST271 మందితో వెళ్తున్న విమానం.. మధ్యలో స్పృహా కొల్పోయిన పైలట్.. ఆ తర్వాత
ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో పైలట్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 271 మంది ప్రయాణికులతో మియామీ నుండి చిలీకి వెళ్లే బిజినెస్ క్లాస్ విమానం బాత్రూమ్‌లో పైలట్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో.. పనామాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శాంటియాగోకు బయలుదేరిన లాటం(LATAM) ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ కమాండర్ అయిన 56 ఏళ్ల ఇవాన్ అందౌర్ రాత్రి 11 గంటలకు తీవ్రమైన గుండె పోటుతో మృతి చెందాడు.
పనామా నగరంలోని టోకుమెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ కో-పైలట్‌లు అత్యవసర ల్యాండింగ్‌ను చేశారు. ఆ వెంటనే అక్కడి వైద్య సిబ్బంది పైలట్‌ని రక్షించే ప్రయత్నం చేశారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇసడోరా అనే నర్సు, ఇద్దరు వైద్యులు విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో పైలట్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వారు ఎంత ప్రయత్నించినప్పటికీ.. అతను తిరిగి లేవలేదు. పనామా సిటీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత పైలట్ చనిపోయినట్లు ప్రకటించారు. విమానంలో దాదాపు 40 నిమిషాలకు.. విమానంలో అందుబాటులో ఉన్న వైద్యుల కోసం కో-పైలట్ ఒక అభ్యర్ధనను జారీ చేసినట్లు ప్రయాణీకులు తెలిపారు.
అందౌర్ పరిస్థితి విషమించడంతో, పరిస్థితి తీవ్రత దృష్ట్యా ల్యాండింగ్ చేయగానే విమానాన్ని ఖాళీ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. పనామా సిటీ హోటళ్లలో ప్రయాణీకులకు వసతి కల్పించారు. అయితే మంగళవారం విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. విషాదానికి ప్రతిస్పందనగా లాటం ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ సమయంలో ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. విచారకరంగా ల్యాండింగ్‌పై తక్షణ వైద్య సహాయం అందించినప్పటికీ, ఇవాన్ అందౌర్‌ను రక్షించలేకపోయారు. లాటం గ్రూప్ ఈ దురదృష్టకర సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పైలట్‌ను కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేసింది.