ఆప్ఘనిస్తాన్‌లో జంట పేలుళ్లు..17 మంది మృతి
Afghanistan’s Bamyan bomb blasting .. ఆప్ఘనిస్తాన్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బామియన్ నగరంలో మంగళవారం
By సుభాష్ Published on 25 Nov 2020 12:25 AM GMTఆప్ఘనిస్తాన్‌లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బామియన్ నగరంలో మంగళవారం జరిగిన రెండు జంట పేలుళ్లలో 17 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం.. టోమి న్యూస్ బామియన్ నగరంలోని స్థానిక మార్కెట్లో పేలుళ్లు జరిగాయి. అయితే పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ప్రముఖంగా ఒమియాన్ అత్యంత సురక్షితమైన ప్రావిన్స్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించడం ఇదే తొలిసారి. ఈ దాడులపై అధ్యక్షుడు అష్రఫ్‌ఘని మాట్లాడుతూ.. స్థిరమైన శాంతిని నెలకొల్పడానికి బలమైన ప్రాంతీయ ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. ఈ సమావేశంలోనే పేలుళ్లు జరగడం సంచలనంగా మారింది. భారత కాలమాన ప్రకారం నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
2001లో ఉగ్రవాదులు పేల్చిన బుద్ద విగ్రహాలకు నిలయం. ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశం ఇది. గత ఏడాది నాలుగు లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో సందర్శించారు. ఇందులో 400 మంది విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. బమియన్ ప్రాంతంలో ఈ పేలుళ్లు జరగడం ఇదే తొలిసారి. మరోవైపు గత కొన్ని నెలల కిందట ఖాతర్ రాజధాని దోహల్ ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ల ప్రత్యక్ష చర్చల కోసం మొదటిసారి సమావేశం అయినప్పటికీ ఆప్ఘనిస్తాన్ దేశ వ్యాప్తంగా హింస పెరుగుతోంది.