ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగాల‌కు రాజీనామా

A record 4.5 million Americans quit their jobs in November.క‌రోనా ఉద్యోగుల్లో పెను మార్పుల‌ను తీసుకువ‌చ్చింది. ఒక్క‌పుడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jan 2022 11:47 AM IST
ఒక్క నెలలో 45 లక్షల మంది ఉద్యోగాల‌కు రాజీనామా

క‌రోనా ఉద్యోగుల్లో పెను మార్పుల‌ను తీసుకువ‌చ్చింది. ఒక్క‌పుడు చిన్న ఉద్యోగం అయినా స‌రే చేసేందుకు వెనుకాడేవారు కాదు. అయితే.. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు మారిపోయాయి. క‌రోనా క‌ష్ట‌కాలంలో తాము ప‌నిచేసిన‌ సంస్థ‌లు నిర్థాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచి తీసివేయ‌డం ఓ కార‌ణం. దీంతో అధిక వేత‌నాలు వ‌చ్చే ఉద్యోగాల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈక్ర‌మంలో ఉన్న ఉద్యోగాల‌ను మానేస్తున్నారు. అమెరికాలో గ‌తేడాది(2021) న‌వంబ‌ర్‌లో 45 ల‌క్ష‌ల మంది త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేశార‌ని అమెరికా కార్మిక‌శాఖ వెల్ల‌డించింది.

సెప్టెంబ‌ర్ నెల‌తో పోల్చుకుంటే న‌వంబ‌ర్‌లో ఉద్యోగాలను వ‌దులుకున్న వారి సంఖ్య 3 శాతం పెరిగింది. ఉద్యోగాలు వదులుకుంటున్న వారిలో ఫుడ్ సర్వీసెస్ కార్యకలాపాలు నిర్వహించేవారే ఏకంగా 1.59 లక్షల మంది ఉన్నట్టు ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి. వీరి తర్వాతి స్థానంలో ఆరోగ్య సంబంధిత రంగాల వారు 52 వేల మంది, రవాణా సేవలకు సంబంధించిన వారు 33 వేల మంది ఉన్నార‌ట‌. ఇక అదే స‌మ‌యంలో అందుబాటులోకి వ‌స్తున్న ఉద్యోగాల సంఖ్య పెరుగుతోంది.

అక్టోబ‌ర్‌లో 1.11 కోట్ల ఉద్యోగాలు ఉండ‌గా.. న‌వంబ‌ర్‌లో కాస్త త‌గ్గి 1.6 కోట్ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్న‌ట్లు కార్మిక‌శాఖ తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని, ఫలితంగా జాబ్ మార్కెట్ పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. గ‌తేడాది ఏప్రిల్ నుంచి 1.85 కోట్ల మంది ఉపాధి పొందిన‌ట్లు తెలిపారు.

Next Story