దాగుడు మూతలు ఆడుతూ.. మరో దేశం చేరుకున్న బాలుడు

A boy who reached another country 3700 km away while playing hide and seek. దాగుడు మూతల ఆట ఆడుతూ.. 15 ఏళ్ల బాలుడు 3700 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశానికి

By అంజి  Published on  29 Jan 2023 10:55 AM GMT
దాగుడు మూతలు ఆడుతూ.. మరో దేశం చేరుకున్న బాలుడు

దాగుడు మూతల ఆట ఆడుతూ.. 15 ఏళ్ల బాలుడు 3700 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశానికి చేరుకున్నాడు. 6 రోజుల తర్వాత అతను వేరే దేశంలో కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. కేసు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జరిగింది. అక్కడ నుండి తప్పిపోయిన బాలుడు 7 రోజుల తర్వాత మలేషియాలో కనుగొనబడ్డాడు.

15 ఏళ్ల ఫహీమ్ చిట్టగాంగ్ పోర్ట్‌లో తన స్నేహితులతో దాగుడుమూతలు ఆడుతున్నాడు. ఇంతలో షిప్పింగ్ కంటైనర్‌లోకి వెళ్లి అక్కడే పడుకున్నాడు. ఆ తర్వాత ఆ కంటైనర్ మలేషియా చేరుకుంది. అతని కుటుంబ సభ్యులకు గానీ, అక్కడ పనిచేస్తున్న వారికి గానీ ఈ విషయంపై ఎలాంటి క్లూ లభించలేదు. అయితే మలేషియా ఓడరేవులో కంటైనర్ తెరవడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అందులోంచి ఒక బాలుడు బయటకు వచ్చాడు. విచారణలో అతడు బంగ్లాదేశ్‌కు చెందినవాడని తేలింది. దీంతో అధికారులు చిట్టగాంగ్ పోర్టు ఉద్యోగులకు సమాచారం అందించారు.

జనవరి 11న అదృశ్యమైన ఫహీం జనవరి 17న మలేషియా ఓడరేవులో కనిపించాడు. మలేషియా వార్తా సంస్థ బెర్నామా ప్రకారం.. ఈ సంఘటనపై మలేషియా హోం మంత్రి డాతుక్ సేరీ సైఫుద్దీన్ నస్యుషన్ ఇస్మాయిల్ ఒక ప్రకటన ఇచ్చాడు. బాలుడు కంటైనర్‌లోకి ప్రవేశించాడని, ఆపై అక్కడే పడుకుని ఇక్కడకు చేరుకున్నాడని తెలిపారు. కంటైనర్‌లో వారం రోజుల పాటు ఫహీం ఆకలితో, దాహంతో ఉన్నాడు. ఈ కారణంగా అతను చాలా బలహీనంగా ఉన్నాడు. అతనికి జ్వరం కూడా వచ్చింది. బాలుడిని బయటకు తీసిన తర్వాత పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇది మానవ అక్రమ రవాణా కేసుగా భావించిన పోలీసులు తొలుత బంగ్లాదేశ్ అధికార యంత్రాంగాన్ని సంప్రదించగా అసలు విషయం బయటపడింది. అయితే ఇది మొదటి కేసు కాదు. గతేడాది అక్టోబర్‌లో మలేషియా పోలీసులు కంటైనర్‌లో 15 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Next Story