మంట‌ల్లో త‌గ‌ల‌బ‌డిపోతున్న ఓ ఇంట్లో 8 మృతదేహాలు.. అందులో ఆరుగురు చిన్నారులు

8 Found Dead After Tulsa Suburb House Fire.మంట‌ల్లో త‌గ‌ల‌బ‌డిపోతున్న ఓ ఇంట్లో 8 మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Oct 2022 4:08 AM GMT
మంట‌ల్లో త‌గ‌ల‌బ‌డిపోతున్న ఓ ఇంట్లో 8 మృతదేహాలు.. అందులో ఆరుగురు చిన్నారులు

మంట‌ల్లో త‌గ‌ల‌బ‌డిపోతున్న ఓ ఇంట్లో 8 మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి. వీటిలో ఆరుగురు చిన్నారులు ఉండ‌డం అంద‌రినీ క‌లిచి వేస్తోంది. అమెరికాలోని ఒక్ల‌హామా రాష్ట్రం బ్రెకెన్ యూరో ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

క‌టెలిన్ అనే మ‌హిళ కారులో ఆ ఇంటి మీదుగా వెలుతుండ‌గా ద‌ట్ట‌మైన పొగ‌లు రావ‌డాన్ని గుర్తించింది. ఆ స‌మ‌యంలో ఇంటి ముందు ఓ వ్య‌క్తి సృహ‌లో లేని ఓ మ‌హిళ‌ను ఈడ్చుకుంటూ వెలుతుండ‌డాన్ని గ‌మ‌నించింది. పోలీసుల‌కు స‌మాచారం అందించింది. వెంట‌నే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు. మంట‌లను ఆర్పి వేశారు. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అనుమానాస్ప‌ద స్థితిలో 8 మృత‌దేహాలు క‌నిపించాయి.

ఇంట్లో ఉన్న పెద్ద‌లు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా..? లేదా ఎవరైనా వీరిని చంపి ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారా..? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు బ్రోకెన్ యూరో పోలీస్ చీఫ్ బ్రాండ‌న్ బెర్రీహిల్ తెలిపారు. మ‌ర‌ణించిన చిన్నారుల వ‌య‌స్సు 1 నుంచి 13 మ‌ధ్య ఉంటుంద‌ని వెల్ల‌డించారు.

కాగా.. వీరంద‌రూ అగ్నిప్ర‌మాదంగా మ‌ర‌ణించిన‌ట్లుగా అనిపించ‌డం లేద‌ని అగ్నిమాప‌క సిబ్బంది తెలిపారు. ఆ ఇంట్లోంచి పోలీసులు తుపాకుల‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story