కరేబియన్ సముద్రంలో 7.5 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

శనివారం కరేబియన్ సముద్రంలోని హోండురాస్‌కు ఉత్తరాన కనీసం 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని బహుళ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు తెలిపాయి.

By అంజి  Published on  9 Feb 2025 7:03 AM IST
7.5-magnitude earthquake, Caribbean sea, Tsunami warning issued, USGS

కరేబియన్ సముద్రంలో 7.5 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

శనివారం కరేబియన్ సముద్రంలోని హోండురాస్‌కు ఉత్తరాన కనీసం 7.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిందని బహుళ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు తెలిపాయి. మొదట భూకంప తీవ్రత 6.89గా అంచనా వేసిన తర్వాత, భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ నివేదించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం భూకంపం తీవ్రత 7.6గా నమోదైందని, 10 కి.మీ లోతులో ఉందని తెలిపింది.

భూమిపై ఏదైనా కదలిక లేదా నష్టం జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది. 2021లో హైతీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపమని యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. కరేబియన్ సముద్రం, హోండురాస్ ఉత్తరాన భూకంపం తర్వాత సునామీ హెచ్చరిక అమలులో ఉందని యూఎస్‌ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది. యూఎస్‌ అట్లాంటిక్ లేదా గల్ఫ్ తీరంలో సునామీ వచ్చే అవకాశం లేకపోలేదని కూడా తెలిపింది. భూకంపం తరువాత ప్యూర్టో రికో మరియు వర్జిన్ దీవులకు యూఎస్‌ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది.

Next Story