ఈ తెల్లవారుజామున అంటార్కిటికాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతగా నమోదైంది. భూకంపంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చిలీ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్నీ ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా..7.1 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటికీ ఆస్తి, ప్రాణనష్టంపై తమకు ఎలాంటి స్పష్టమైన సమాచారం అందలేదని చిలి అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి తెలిపారు. 10 కి.మీల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.
ఇదే సమయంలో శాంటియాగో సమీపంలో 5.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించగా, ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్టుగా సమాచారం తెలియలేదు. చిలిలోఒకేరోజున రెండు భూకంపాలు రావడంతో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తీరప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.