స్విట్జర్లాండ్‌లోని ఒక లగ్జరీ బార్‌లో న్యూఇయర్ వేడుకల్లో భారీ పేలుడు జరిగింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీ పేలుడు కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో కనీసం 40 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారని స్విస్ పోలీసులను ఉటంకిస్తూ ఇటాలియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, మృతుల సంఖ్య "పదుల" కంటే ఎక్కువగా ఉండదని పోలీసులు తెలిపారు.
స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మోంటానాలోని లె కాన్స్టెలేషన్ బార్ అండ్ లాంజ్ బేస్మెంట్ వద్ద జరిగిన పేలుడును అగ్నిప్రమాదంగా పరిగణిస్తున్నామని , ఉగ్రవాద దాడి కాదని స్విస్ అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో బార్‌లో 150 మందికి పైగా ఉన్నారు.