అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం
3 Dead in Shooting at Publix Supermarket in Florida.అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ సూపర్
By తోట వంశీ కుమార్ Published on 11 Jun 2021 4:07 PM IST
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ సూపర్ మార్కెట్‌లోకి తుపాకీతో ప్రవేశించిన ఓయువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఏడాది వయస్సు ఉన్న బాబు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సదరు దుండగుడు కూడా తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన ఫ్లోరిడాలోని రాయల్ ఫామ్ బీచ్ సమీపంలో జరిగింది.
ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్బిక్స్ సూపర్ మార్కెట్‌లోకి తుపాకితో ఓ దుండగుడు ప్రవేశించాడు. ఇద్దరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకి తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో వృద్ధ మహిళ సహా ఏడాది వయసున్న ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డి మరణించారు. వారిద్దరు చనిపోయారు అని నిర్థారించుకున్న అనంతరం ఆ దుండగుడు తనను తాను కాల్పుకుని మరణించాడు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల గుర్తిం పు వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి, మృతులకుముందే తెలుసునని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలో గత ఆదివారం కూడా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. మియామిలోని జరిగే గ్రాడ్యూయేషన్ పార్టీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గరు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు.