రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి

థాయ్‌లాండ్‌లో కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి.

By -  Medi Samrat
Published on : 14 Jan 2026 1:40 PM IST

రైలుపై జారిపడిన క్రేన్.. 22 మంది మృతి

థాయ్‌లాండ్‌లో కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారిపడటంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో 22 మంది మృతి చెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్‌ కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో హైస్పీడ్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ నిర్మాణ పనుల్లో ఉన్న ఓ క్రేన్‌ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో కింద ఉన్న పట్టాలపై నుంచి ఓ ప్రయాణికుల రైలు వెళ్తోంది. క్రేన్‌ పడటంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది మృతిచెందగా మరో 30 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆ రైలు థాయిలాండ్‌లోని ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు వెళుతోంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుపై పనిచేస్తున్నప్పుడు ఒక క్రేన్ కూలిపోయి రైలు మీద పడింది. దీని కారణంగా రైలు పట్టాలు తప్పి మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని రక్షించడానికి శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు.

Next Story