ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతుండగా కూలిన విమానం.. 18 మంది మృతి

నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది.

By అంజి  Published on  24 July 2024 7:12 AM GMT
plane crash, Kathmandu, pilot, hospital, Nepal

ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతుండగా కూలిన విమానం.. 18 మంది మృతి

నేపాల్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) వద్ద శౌర్య ఎయిర్‌లైన్స్ విమానం, 9N-AME (CRJ 200) టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోఖారా వెళ్లే విమానంలో 19 మంది ఉన్నారు. విమానం పైలట్‌ 37 ఏళ్ల మనీష్‌ షాక్యాను శిథిలాల నుంచి రక్షించి చికిత్స నిమిత్తం సినమంగల్‌లోని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విమానంలో విమానయాన సంస్థ సాంకేతిక సిబ్బంది ఉన్నారు అని టీఐఏ వద్ద సమాచార అధికారి జ్ఞానేంద్ర భుల్ హిమాలయన్‌తో చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుంచి పొగలు కమ్ముకున్నాయి.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల కోసం రంగంలోకి దిగారు. ఈ విమానయాన సంస్థను భారతదేశానికి చెందిన కుబేర్ గ్రూప్ 2019లో 630 మిలియన్ నేపాలీ రూపాయలకు కొనుగోలు చేసింది. 2021లో, విమానయాన సంస్థ కుబేర్ ఎయిర్‌లైన్స్‌గా రీబ్రాండ్ అవుతుందని నివేదికలు వచ్చాయి, అయితే అది తాత్కాలికంగా నిలిపివేయబడింది.

Next Story