నేపాల్‌లోని తనహున్ జిల్లాలో భారతీయ ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. 14 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. 40 మంది భారతీయులతో బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళుతోంది. "యుపి ఎఫ్‌టి 7623 నంబర్ ప్లేట్ కలిగిన బస్సు నదిలో పడిపోయింది" అని తనహున్ జిల్లా డిఎస్‌పి దీప్‌కుమార్ రాయా తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ స్కూల్ నుండి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) మాధవ్ పాడెల్ నేతృత్వంలోని 45 మంది పోలీసుల బృందం ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పోఖారాలోని మజేరి రిసార్ట్‌లో భారతీయ ప్రయాణికులు బస చేశారు. శుక్రవారం ఉదయం పోఖారా నుంచి ఖాట్మండుకు బస్సు బయలుదేరింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.