వామ్మో.. వాళ్లంతా వచ్చేస్తున్నారు..!

నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జైళ్ల నుంచి తప్పించుకున్నారు ఖైదీలు.

By -  Medi Samrat
Published on : 11 Sept 2025 4:40 PM IST

వామ్మో.. వాళ్లంతా వచ్చేస్తున్నారు..!

నేపాల్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా జైళ్ల నుంచి తప్పించుకున్నారు ఖైదీలు. వారంతా భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలు భగ్నం చేశాయి. దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 30 మంది నేపాలీ ఖైదీలను ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టయిన వారిలో 17 మందిని ఉత్తరప్రదేశ్‌లో, మిగిలిన 13 మందిని బీహార్, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని సహా ఏడు జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్, డీజీపీ వినయ్ కుమార్‌తో కలిసి సరిహద్దు జిల్లాల డీఎంలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Next Story