హెలికాప్టర్లు ఢీ కొని 13 మంది సైనికులు మృతి

By అంజి  Published on  27 Nov 2019 6:22 AM GMT
హెలికాప్టర్లు ఢీ కొని 13 మంది సైనికులు మృతి

రెండు హెలికాప్టర్లు గగనతలంలో ఢీకొన్న ఘటనలో ఫ్రాన్స్‌కు చెందిన 13 మంది సైనికులు మృతి చెందారు. ఆఫ్రికా దేశం మాలిలో సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతూ ఉండగా సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ర్లు ఢీకొనడం వలన సైనికులు మరణించారని ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం ధృవీకరించింది. చనిపోయిన వారి కుటుంబాలకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనల్ని కాపాడే 13 మంది హీరోలను మనం కోల్పోయామని ట్వీట్ చేశారు.

 109898491 9f038b80 94fa 442f B3c7 63eabd748cc7

మరణించిన వారిలో ఆరుగురు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఫ్రాన్స్ రక్షణమంత్రి భరోసా ఇచ్చారు. గత కొద్ది దశాబ్దాల కాలంలో ఇది అత్యంత విషాదకర ఘటన అని చెబుతున్నారు. మాలీలో ఇటీవల ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ బలగాలు 2013 నుంచి మాలిలో పహారా కాస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 4,500 ఫ్రాన్స్ బలగాలు మళ్లీ సైన్యానికి సహకరిస్తున్నాయి. ఈ బలగాలే మిలిటెంట్ల తో పోరాడుతుండగా రెండు చాపర్లు ఢీకొన్న టు గా సమాచారం.

28965adb Cc7f 4ecb 897e 211f3e76cb0a

Next Story