ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత..!

By అంజి  Published on  3 Dec 2019 4:22 AM GMT
ముషారఫ్‌కు తీవ్ర అస్వస్థత..!

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ తీవ్ర అస్వస్థతకు గురయారు. గుండె సంబంధింత సమస్యలతో పాటు రక్తపోటు అధికంగా ఉండడంతో అతనిని దుబాయిలోని ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య కారణాలతో 2016లో చికిత్స కోసం దుబాయ్ వచ్చిన తర్వాత ఆయన పాకిస్తాన్ కు తిరిగి వెళ్ళనే లేదు. ప్రస్తుతం ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదై ఉంది. ఈ కేసులో లాహోర్ హైకోర్టు నుంచి ఎల్లుండి తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముషారఫ్ ఆసుపత్రిలో చేరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నవంబర్ 3, 2007 లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలంటూ దేశద్రోహం కేసు నమోదు కాగా ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. కేసులో తమ ఎదుట హాజరు కావాలంటూ ముషారఫ్ కు కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసింది. అయినప్పటికీ ముషారఫ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ కేసును ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది.

Next Story
Share it