మెక్సికోలో డ్రగ్స్ ముఠా, భద్రతా దళాల మధ్య భీకర పోరు..!

By అంజి  Published on  2 Dec 2019 5:13 AM GMT
మెక్సికోలో డ్రగ్స్ ముఠా, భద్రతా దళాల మధ్య భీకర పోరు..!

భద్రతా బలగాలకు, డ్రగ్స్ ముఠాకు మధ్యజరిగిన భీకర ఎదురు కాల్పుల్లో 19 మంది మృతి చెందిన సంఘటన మెక్సికోలో జరిగింది. చనిపోయిన వారిలో 13 మంది ముఠా సభ్యులు, ఇద్దరు సామాన్య పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా సరిహద్దు కి 40 మైళ్ళ దూరంలో ఉన్న విల్లా యూనియన్ పట్టణంలోని ఓ భవనంలోకి దుండగులు ప్రయత్నించినట్లు తెలుసుకున్న భద్రతా దళాలు భవనాన్ని చుట్టుముట్టాయి. దీంతో డ్రగ్స్ ముఠా కాల్పులు ప్రారంభించింది. అప్రమత్తమైన భద్రతా దళాలు కూడా కాల్పులు జరపడంతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కొన్ని గంటల పాటు కాల్పులు నిర్విరామంగా కొనసాగాయి. ఘటనా స్థలంలో 14 ట్రక్కులు, భారీస్థాయిలో పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మెక్సికన్ మాదకద్రవ్యాల మఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తామని ట్రంపు ప్రకటించిన నేపథ్యంలో ఈ కాల్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story