శ్వేత..ఒక రోజు బాస్, స్నేహల్ ఒక రోజు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 10:35 AM GMT
శ్వేత..ఒక రోజు బాస్, స్నేహల్ ఒక రోజు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్..!

హైదరాబాద్‌: చిన్నారులకు చిన్నతనంలో వారి మనసులో ఏది నాటుకుంటే పెద్ద అయ్యాక అవి అవడానికి ప్రయత్నిస్తారు. ఉన్నత స్దానాలకు ఎదగడానికి ఆలొచిస్తారు. కచ్చితంగా అదే ప్రయత్నం చేస్తుంది. అప్సా ప్లాన్‌ సంస్థ. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ కార్యాలయంలోని విద్యార్ధిని శ్వేత ఆఫీసర్ బాధ్యతలు నిర్వహించారు. జంట నగరాల సంయుక్త కార్మిక శాఖ కమిషనర్‌గా ఒక రోజు విధులు నిర్వహించింది. సికింద్రాబాద్‌ బల్సీలాల్‌ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో శ్వేత 9వ తరగతి చదువుతుంది. ఒక్క రోజు ప్రభుత్వ విధులు నిర్వహించడం సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పింది. ఉన్నత విద్యను అభ్యసించి మంచి అధికారిగా స్థిరపడతానని తెలిపింది. విద్యార్ధులు భవిష్యత్తులో లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇలాంటివి తోడ్పడతాయని లేబర్ కమిషనర్ గంగాధర్‌ చెప్పారు.

ఒకరోజు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌గా హైదరాబాద్‌ టెక్కీ

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల స్నేహల్ రావత్ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. 'బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఫర్ ఎ డే' గా ఎంపికయ్యారు.

Techie Snehal Rawat becomes British deputy High Commissioner ‘for a day’

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్టాలకు చెందిన బ్రిటిష్ డిప్యుటి కమిషనర్ గా ఆమె ఒకరోజు విధులు నిర్వహించారు. 'లింగ సమానత్వం ఎందుకు ముఖ్యం, ఎవరు మీకు ఆదర్శం 'అనే అంశంపై బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీకి.. ఒక్క నిమిషం నిడివి గల వీడియోను పంపారు.

Snehal 2

ఈ పోటీని 18-23 ఏళ్ల మధ్య గల యువతులు ఎందరో పాల్గొన్నారు. వారందరిలో స్నేహల్ ఎంపికవడంతో శుక్రవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు డిప్యూటీ హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు.

Snehal 3

స్నేహల్ కి రోజంతా హడావుడిగా గడిచిపోయింది. హైదరాబాద్ కు చెందిన వివిధ సంస్థల అధికారులతో ఆమె భేటీ అయ్యారు. ఇది ఒక వినూత్నమైన అనుభూతి అని, ఎన్నో విషయాలు తెలుసుకున్నానని స్నేహల్ చెప్పింది.

Snehal hari chandana

Snehal 4

Next Story