రామ్ చ‌ర‌ణ్ 'నెక్ట్స్ మూవీ' గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 9:53 AM GMT
రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం 'ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి' ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న క్రేజీ మూవీ 'ఆర్ఆర్‌' లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే సంవ‌త్స‌రంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే... ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్‌తో సినిమా చేసేందుకు చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. అలాగే చ‌ర‌ణ్ కూడా కొంత మంది ద‌ర్శ‌కులకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే అలా.. చ‌ర‌ణ్ మాట ఇచ్చిన వారిలో దర్శకుడు విక్ర‌మ్ కుమార్ ఒక‌రు. విక్ర‌మ్ కుమార్ కూడా ఓ ఇంట‌ర్ వ్యూలో చ‌ర‌ణ్ తో సినిమా చేసేందుకు 'క‌థ రెడీ' చేస్తున్న‌ట్టు చెప్పారు. ఇష్క్, మ‌నం, 24 చిత్రాల‌తో విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడిగా విక్ర‌మ్ కుమార్ మంచి పేరు సంపాదించారు. అయితే... ఇటీవ‌ల తెర‌కెక్కించిన హ‌లో, గ్యాంగ్ లీడ‌ర్ చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయాయి. అయిన‌ప్ప‌టికీ ' రామ్‌ చ‌ర‌ణ్'..విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విక్ర‌మ్ కుమార్ క‌థ పై క‌స‌ర‌త్తు చేసే పనిలో ఉన్నట్లు.. త్వ‌ర‌లో చ‌ర‌ణ్‌కి స్టోరీ చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే.. రామ్ చ‌ర‌ణ్ - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్‌లో సినిమా రానుంది. మ‌రి... త్వ‌ర‌లో ఎనౌన్స్ మెంట్ వ‌స్తుందేమో చూడాలి.

Next Story
Share it