ఇంటర్‌ వాల్యువేషన్‌ను వాయిదా వేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. బషీర్‌బాగ్‌లోని ఇంటర్ ఎగ్జామినేషన్ కార్యాలయం ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కరోనా వైరస్‌ విభృభిస్తున్న నేపథ్యంలో వాల్యువేషన్‌ను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఇటలీలో వైరస్‌ విభృభించడానికి అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడమేనన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిలో వాల్యువేషన్‌ను వాయిదా వేస్తేనే మంచిదని.. లేకుంటే.. వారికి కూడా వైరస్‌ సోకే ప్రమాదముందన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే వాల్యువేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18కి చేరుకుంది. భారత్‌లో ఇప్పటి వరకు 223 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 4గురు మృత్యువాత పడ్డారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కరోనా మరణాల సంఖ్య 10వేలకు చేరుకుంది. 2 లక్షలకుపైగా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల్లో ముందుగా చైనా ఉండగా, రెండోస్థానంలో ఇటలీ ఉండేది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.